తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల(MLC Elections) పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 8గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4గంటల వరకు జరగనుంది. పోలింగ్ కేంద్రాల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఏపీలో ఉత్తరాంధ్ర టీచర్, ఉభయగోదావరి, కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాలకు పోలింగ్ కొనసాగుతుంది. ఉమ్మడి కృష్ణా – గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో 25 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక్కడ కూడా టీడీపీ, పీడీఎఫ్ అభ్యర్థుల మధ్యే ప్రధాన పోటీ ఉంది. టీడీపీ నుంచి మాజీ మంత్రి ఆలపాటి రాజా బరిలో నిలవగా.. పీడీఎఫ్ నుంచి కేఎస్ లక్ష్మణరావు పోటీ ఉన్నారు. ఈ స్థానంలో 3,47,116 మంది పట్టభద్రులు ఓటర్లుగా ఉన్నారు.


ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం చంద్రబాబు(Chandrababu), మంత్రి నారా లోకేశ్(Lokesh) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉండవల్లిలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో చంద్రబాబు, లోకేశ్ ఓటు వేశారు.


