Sunday, November 24, 2024
Homeఆంధ్రప్రదేశ్CM Chandrababu: తిరుమల తరహాలో శ్రీశైలం అభివృద్ధి చేస్తాం: చంద్రబాబు

CM Chandrababu: తిరుమల తరహాలో శ్రీశైలం అభివృద్ధి చేస్తాం: చంద్రబాబు

CM Chandrababu| తిరుమల తరహాలో శ్రీశైలాన్ని కూడా అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. శ్రీశైలం మాస్టర్ ప్లాన్ రూపకల్పన కోసం మంత్రులు పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్, ఆనం, బీసీ జనార్ధన్ రెడ్డితో ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. అటవీ, దేవాదాయ శాఖ, జిల్లా కలెక్టర్‌లు చర్చించి ఒక మాస్టర్‌ప్లాన్‌ రూపొందిస్తారని పేర్కొన్నారు. సున్నిపెంట ప్రాంతాన్ని కూడా నివాస యోగ్యంగా ఉండేలా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు.

- Advertisement -

అభివృద్ధి, సంక్షేమం తెలుగుదేశం పార్టీకి రెండు కళ్లు అన్నారు. అభివృద్ధి చేస్తే సంపద పెరుగుతుందని చెప్పారు. తద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. సీ ప్లేన్ ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చిందన్నారు. విజయవాడ నుంచి శ్రీశైలానికి కేవలం 40 నిమిషాల్లో వచ్చామని వెల్లడించారు. కాగా విజయవాడలోని పున్నమిఘాటన్ నుంచి శ్రీశైలానికి సీ ప్లేన్ ద్వారా చంద్రబాబు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రయాణించారు. అక్కడికి చేరుకున్న అనంతరం రోప్ వే ద్వారా శ్రీశైలం ఆలయానికి చేరుకున్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబుకు ఆలయ అధికారులు సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికాయి. అనంతరం భ్రమరాంబికా మల్లికార్జునస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆయనకు వేదాశీర్వచనంతోపాటు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ అధికారులు సీఎంకు స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News