Sunday, January 19, 2025
Homeఆంధ్రప్రదేశ్Chandrababu: ప్రధాని మోదీ కల సాకారం చేసేందుకు కృషి చేస్తాం: సీఎం చంద్రబాబు

Chandrababu: ప్రధాని మోదీ కల సాకారం చేసేందుకు కృషి చేస్తాం: సీఎం చంద్రబాబు

ప్రధాని మోదీ(PM Modi) కలను సాకారం చేసేందుకు అందరం కృషి చేస్తున్నామని.. 2047 నాటికి భారతదేశం ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంటుందని ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu) తెలిపారు. కొండపావులూరులో నిర్వహించిన ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకల్లో ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు ప్రసంగించారు.

- Advertisement -

కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) సారథ్యంలో దేశంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్ర అప్పు రూ.10 లక్షల కోట్లు ఉందన్నారు. ఎన్నికల సమయానికే ఏపీ వెంటిలేటర్‌పై ఉందని.. కేంద్రం ఆక్సిజన్ అందించడంతో ఏపీ వెంటిలేటర్ స్థితి నుంచి బయటపడిందన్నారు. అయితే వెంటిలేటర్ స్థితి నుంచి బయటపడినా ఇంకా పేషెంట్‌గానే ఉందని పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే అమరావతి నిర్మాణం కోసం కేంద్రం రూ.15 వేల కోట్లు ఇచ్చిందని, ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. రు. కేంద్ర ప్రభుత్వం మద్దతుతో 2027 ఏప్రిల్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇక తీవ్ర ఒడిదుడుకుల్లో ఉన్న విశాఖ ఉక్కు పరిశ్రమకు రూ.11,440 కోట్ల ప్యాకేజీతో ఆర్థికసాయం చేసి ప్రాణం పోశారని తెలిపారు. ఇటీవల విశాఖ రైల్వే జోన్ కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారని.. దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు కేంద్రం మద్దతు ఇంకా కావాలని ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News