CM Chandrababu Naidu Vizag Tour: విశాఖ రూపంలో ఆంధ్రప్రదేశ్‌కి మాత్రమే కాకుండా దేశానికే సరికొత్త ఐటీ డెస్టినీ దొరికిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. నేడు విశాఖ పర్యటనలో పాల్గొన్న ఆయన పలు రంగాల్లో రాష్ట్రం సాధిస్తున్న ప్రగతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఐటీ, వ్యవసాయం, ఆక్వా రంగాల్లోనే కాకుండా ముఖ్యంగా రాష్ట్ర మహిళలకు సురక్షితమైన నగరంగా విశాఖ ఖ్యాతి గడించిందని చెప్పారు. విశాఖ అందాలే కాదు.. ప్రజలు కూడా క్రమశిక్షణగా ఉంటారని ఈ సందర్భంగా ఆయన అన్నారు.
జీడీపీలో తోపు: విశాఖపట్నంలో ఇండియా ఫుడ్ మాన్యుఫాక్చరింగ్ సదస్సును నిర్వహించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలో అనేక అవకాశాలు ఉన్నాయని.. ఈ పరిశ్రమలో ఏపీ 50 బిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థ కలిగి ఉందని వెల్లడించారు. వ్యవసాయం నుంచి దాదాపు 35 శాతం జీఎస్‌డీపీ అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ మాత్రమేనని అన్నారు. హార్టికల్చర్, లైవ్ స్టాక్, ఆక్వాకల్చర్ రంగాల్లో ఏపీ అగ్రస్థానంలో ఉందని ఆయన గుర్తుచేశారు. అదే విధంగా దేశంలోని పండ్ల ఉత్పత్తుల్లో 25 శాతం ఏపీ నుంచే ఉన్నాయని వివరించారు. రాష్ట్రంలో 2.26 లక్షల హెక్టార్లలో ఆక్వాకల్చర్ కొనసాగుతుందని అన్నారు.
రైస్ బౌల్ ఆఫ్ ఇండియా: ఆక్వా, కోడిగుడ్ల ఉత్పత్తిలో ఏపీ ప్రథమస్థానంలో ఉందని.. రాష్ట్రంలో 9 ఇంటిగ్రేటెడ్ ఫుడ్ ప్రాసెసింగ్ పార్కులు కూడా ఉన్నాయన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ప్రథమ స్థానంలో ఉన్నామని చెప్పారు. ఇదే జోరును కొనసాగిస్తూ ఏపీ అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తామని చెప్పారు. ఇందుకు అవసరమైన సహాయ సహకారాలన్నీ అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు.
2027 నాటికి పోలవరం పూర్తిచేసి.. జాతికి అంకితం చేస్తామన్న ముఖ్యమంత్రి.. రాష్ట్రంలో ఇప్పటికే 85 శాతం రిజర్వాయర్లు నిండాయని ఇది శుభ పరిణామన్నారు. ఇదే సమయంలో ఏపీలో కోల్డ్ స్టోరేజీల సామర్ధ్యం 17 లక్షల మెట్రిక్ టన్నులకు చేరిందన్నారు. ప్రతి 50 కి.మీలకు ఒక పోర్టు చొప్పున 20 పోర్టులు నిర్మిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్కు నిర్మిస్తామని సభా సాక్షిగా ఆయన పేర్కొన్నారు.
Chandrababu Naidu: ప్రతి నియోజకవర్గంలో ఒక MSME పార్క్ నిర్మిస్తాం!
సంబంధిత వార్తలు | RELATED ARTICLES


