గుంటూరు జిల్లా పొన్నెకల్లు పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఓ దళిత కుటుంబాన్ని కలిసి ఆశ్చర్యపరిచారు. గ్రామంలోని ఎస్సీ కాలనీలో పర్యటించిన ఆయన ప్రవీణ్ అనే యువకుడి మెకానిక్ షెడ్డును సందర్శించారు. బైక్ మెకానిక్‌ల సమస్యలను తెలుసుకున్న చంద్రబాబు అతడికి మంచి శిక్షణ ఇచ్చి, మెరుగైన వసతులతో గ్యారేజ్ ఏర్పాటుకు ఆర్థిక సాయం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం అతడి ఇంటికి వెళ్లి యువకుడి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఇల్లు కూడా మంజూరు చేయాలని అధికారులకు సూచించారు. దీంతో ప్రవీణ్ కుటుంబం సంతోషంలో మునిగిపోయింది.
CM Chandrababu: దళిత కుటుంబాన్ని ఆశ్చర్యపరిచిన సీఎం చంద్రబాబు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES