Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Co-operative Bank Chairman SV Vijaya Manohari: సహకార బ్యాంకు ఛైర్మన్ గా విజయ...

Co-operative Bank Chairman SV Vijaya Manohari: సహకార బ్యాంకు ఛైర్మన్ గా విజయ మనోహరి

సీఎం తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్న కొత్త ఛైర్మన్

జిల్లా సహకర కేంద్ర బ్యాంకును అభివృద్ధి పథంలో నిలిపి జగన్నన్న నమ్మకాన్ని నిలబెడతానన్నారు
ఎస్ వి విజయ మనోహరి. జిల్లా సహకర కేంద్ర బ్యాంకు చైర్మన్ గా మాజీ ఎమ్మెల్యే ఎస్ వి మోహన్ రెడ్డి సతీమణి ఎస్ వి విజయ మనోహరి పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమం భారీ జనసందోహం మధ్య ఘనంగా జరిగింది. ముందుగా ఆమె మహానేత వై ఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహంకు పూలమాల వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. తమ స్వగృహం నుండి వేలాది వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు వెంట రాగా భర్త ఎస్ వి మోహన్ రెడ్డి, విజయ పాల డైరీ చైర్మన్ ఎస్ వి జగన్ మోహన్ రెడ్డి, ఎస్ రామచంద్ర రెడ్డి, నాగరత్నమ్మతో కలిసి తనయులు ఎస్ వి జనక్ రెడ్డి, ఎస్ వి సాయి జైదీప్ రెడ్డిలతో కలిసి బైక్ ర్యాలీతో 15,000 వేల మంది జనసమూహంతో నగర పుర వీధుల గుండా లక్ష్మి ఫంక్షన్ హాల్ కు చేరుకున్నారు. అక్కడ బ్యాంకు C E O రామాంజనేయులు ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ తమ కుటుంబానికి, బ్యాంకుకు విడదీయారని బంధం అని, తమ మామగారు ఎస్ వి సుబ్బారెడ్డి గతంలో జిల్లా చైర్మన్ గా ఆప్కాబ్ చైర్మన్ పదవిని చేపట్టారని గూర్తు చేశారు. బ్యాంకు టర్నోవర్ ను 3,000 కోట్ల నుండి 4000 వేల కోట్లకు తీసుకెళ్ళేలా కృషి చేస్తానన్నారు.
పాడి పంటలను తమకు జగన్నన్న అప్పగించాడని.. విజయ పాలడైరీ చైర్మన్ గా ఎస్ వి జగన్ మోహన్ రెడ్డి పాడి పరిశ్రమను, తనకు పంటలను జగన్నన్న అప్పగించారని తెలియచేసారు. భారీ ఎత్తున హాజరు అయిన అభిమానులు ఆమెను అభినందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News