14 ఏళ్లుగా కాంట్రాక్టు ఉద్యోగులు చాలిచాలని జీతంతో , ఎన్నో కష్టాలు అనుభవిస్తూ జీవితం వెళ్లబోస్తున్న మాకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దేవుని లాగ, పర్మినెంట్ చేసి మా జీవితాల్లో వెలుగులు నింపి ఆదుకున్నాడని వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు కొనియాడారు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి కానీ కేవలం మోసపూరిత హామీలతో మాట మాత్రం ఇచ్చి మమ్మల్ని మోసం చేశాయి కానీ మా బాధలన్నిటిని నేను విన్నాను నేను చూశాను అంటూ మా కన్నీటి బొట్లను తుడిచిన దేవుడు జగన్ మోహన్ రెడ్డి, మేము మా కుటుంబాలు జగన్ కి ఎల్లప్పుడూ తోడుగా ఉంటాం అని కొనియాడారు. ఈ మేరకు నంద్యాలలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డిని కలిసి జై జగన్ అంటూ నినాదాలు చేసి, పుష్పగుచ్చం ఇచ్చి, సన్మానించి, కేకు కట్ చేయించారు. వైద్య ఆరోగ్యశాఖ నందు రాష్ట్రంలో 4 వేలకు పైగా, నంద్యాల జిల్లాలో సుమారు 100 మంది పర్మినెంట్ అయ్యారని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కిరణ్ కుమార్, రామసుబ్బమ్మ, మౌలాలి, శంకర్ ఆచారి, నాగరాజు పాల్గొన్నారు.
Contract employees: మా జీవితాల్లో వెలుగులు నింపిన దేవుడు జగన్
జగన్ మోహన్ రెడ్డి దేవుని లాగ, పర్మినెంట్ చేసి మా జీవితాల్లో వెలుగులు నింపి ఆదుకున్నాడు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES