ఐఎండి సూచనల ప్రకారం ఉత్తర అండమాన్ సముద్రం మీదుగా ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లోపు తూర్పుమధ్య బంగాళాఖాతం ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.
ఇది పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి, అక్టోబర్ 22 ఉదయం నాటికి వాయుగుండం గా, 23 అక్టోబర్, 2024 నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపాను గా మారే అవకాశం ఉంది.
ఆ తర్వాత, ఇది వాయువ్య దిశగా పయనించి అక్టోబర్ 24 ఉదయం నాటికి ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంకి చేరుకునే అవకాశం ఉంది.
దీని ప్రభావంతో అక్టోబర్ 24, 25 ఉత్తరాంధ్రలో విస్తృతంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అక్టోబర్ 23, 24న పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతల్లో గంటకు 45-65కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయి
సముద్రం అలజడిగా ఉంటుంది. అక్టోబర్ 24 వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదు.
వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తిరిగిరావాలి.
ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
~ రోణంకి కూర్మనాథ్, మేనేజింగ్ డైరెక్టర్, విపత్తుల నిర్వహణ సంస్థ.