Thursday, July 4, 2024
Homeఆంధ్రప్రదేశ్AP Weather : బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీకి వర్షసూచన

AP Weather : బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీకి వర్షసూచన

బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం.. వాయుగుండంగా మారినట్లు భారత వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాబోయే మూడ్రోజుల్లో తమిళనాడులో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో పలుచోట్ల తేలికపాటి జల్లులు నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. ప్రస్తుతం ఈ వాయుగుండం పశ్చిమ నైరుతి దిశగా కదులుతూ శ్రీలంక మీదుగా కొమరిన్ ప్రాంతం వైపు పయనించే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.

- Advertisement -

డిసెంబర్ 24 నుండి దక్షిణ కోస్తాంద్ర, రాయలసీమలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు పేర్కొన్నారు. అలాగే ఈశాన్య గాలుల కారణంగా రాష్ట్రంలో చలితీవ్రత పెరుగుతుందని, రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతాయని తెలిపారు. రాష్ట్రమంతటా దట్టమైన పొగమంచు అలముకుంటుందని వాతావరణశాఖ వివరించింది. కాగా.. ఇప్పటికే మాండూస్ తుపాను కారణంగా.. తీవ్రంగా నష్టపోయారు రైతన్నలు. మరోసారి వర్షసూచన నేపథ్యంలో ఆరబెట్టిన పంటకు ఏమవుతుందోనని బెంగపడుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News