మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రైతులు సాగు చేస్తున్న పండ్ల తోటలపై ఉపాధి అధికారులు డాక్యుమెంటరీని చిత్రీకరించారు. ఈ మేరకు పి. కోటకొండ గ్రామంలో విజయవాడ నుండి వచ్చిన సీఆర్డీ అధికారి శివప్రసాద్ నేతృత్వంలో ఏ.పి.డి. పద్మావతి ఆధ్వర్యంలో చీనీ మొక్కలు సాగు చేస్తున్న కౌలుట్లమ్మ, బలరాం నాయుడు తోటలో చిత్రీకరణ పూర్తి చేశారు. రైతులు సంప్రదాయ పంటలు సాగుచేసుకొని తీవ్రంగా నష్టపోతున్నారని అవి ఆత్మహత్యలకు హేతువవుతోందని పేర్కొన్నారు. రైతులు పండ్ల తోటల వైపు అడుగులు వేసి తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి పొంది లాభాలు అర్జించాలని ఆయన కోరారు.
Devanakonda: పండ్లతోటల సాగుపై డాక్యుమెంటరీ చిత్రీకరణ
సంబంధిత వార్తలు | RELATED ARTICLES