దసరా వచ్చిందంటే చాలు ..గుర్తొచ్చేది దేవరగట్టు కర్రల సమరం…ఎన్నో ఏళ్లుగా ఆచారం పేరిట సాగుతున్న ఈ సంప్రదాయ క్రీడ..వారం రోజుల పాటు జరిగే ఈ ఉత్సవం గురువారం ఆరంభం అయ్యింది..ఈ సందర్భంగా నెరనికి , నెరణి కి తండా, కొత్త పేట భక్తులు,పూజారులు ఉత్సవ మూర్తులను దేవరగట్టు ఆలయంకు చేర్చారు. పూజలు చేసి కంకణధారణ చేశారు.
అనాదిగా వస్తున్న సంప్రదాయం
విజయదశమి రోజున జరిగే (కర్రల సమరం) ఓ ప్రత్యేకథ..ఈ కర్రల సమరంపై వివిధ విబ్బిన కథనాలు ఉన్నాయి. పూర్వం ఉత్సవాలకు వచ్చే సమయంలో అటవీ ప్రాంతం కావడంతో వన్య ప్రాణుల నుంచి రక్షించుకునేందుకు రింగు కర్రలను, ఇతర ఆయుధాలను, దీవిటీలను తీసుకొని పరిసర గ్రామల భక్తులు కర్రలతో రావడం అనావాయితీ. రాత్రి దేవరగట్టు కొండపై నుంచి మాల మల్లేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో పెద్ద ఎత్తున భక్తులు తీసుకువెళ్ళే సమయంలో రక్షణ కర్రలు అడ్డుపెట్టుకునే సమయంలో తరలి వస్తారు. దెబ్బలు తగిలి బుర్రలు పగిలి రక్తం చిందుతుంది..మరోవైపు దేవరగట్టు ఉత్సవాలను గట్టెక్కించేందుకు కొత్తగా వచ్చిన జిల్లా కలెక్టర్ డా సృజన, ఎస్పీ కృష కాంత్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.
ఉత్సవాలపై ఇప్పటికే దేవరగట్టులో భక్తులు, పూజార్లతో సమీక్ష నిర్వహించి గతంలో జరిగిన సంఘటలపై ఆరా తీస్తున్నారు. గతంలో జరిగిన ఘర్షణల్లో మృతి చెందిన సంఘటనలపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ జిల్లా కలెక్టర్, ఎస్పీలకు నోటీస్ లు జారీ చేసింది..గతంలో జరిగిన సంఘటనలు పునరవృతం కాకుండా ఉండేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు ఆరంభించింది..గ్రామాల్లో పత్తికొండ డిఎస్ పి శ్రీనివాస రెడ్డి, ఆలూరు సి ఐ వెంకటేశ్వర్లు, సిబ్బంది అవగాహన సదస్సులు నిర్వహిస్తూ కర్రలను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకోసం ముందస్తుగా ఆయా గ్రామాల్లో పోలీసులు కర్రల కోసం జల్లెడ పడుతున్నారు. సిసి కెమెరాలు, డ్రోన్ కెమెరాలు, వెయ్యి మంది పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు.. నాటు సారా నియంత్రణకు సిబ్బంది చర్యలు చేపట్టారు..ఇందుకోసం ప్రతిరోజూ కలెక్టర్, ఎస్పీ అధికార్లను సమీక్షిస్తున్నారు..ఈసారి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు.