ఎన్.ఎస్.యు.ఐ ఆధ్వర్యంలో సర్దార్ భగత్ సింగ్ జయంతిని డోన్ ప్రభుత్వ బి.సి బాలికల హాస్టల్లో వార్డెన్ మేరీ మేడమ్ అధ్యక్షతన యూటీఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు వెంకట సుబ్బారెడ్డి, యూటీఎఫ్ సీనియర్ నాయకులు సుబ్బారాయుడు పూలమాలవేసి భగత్ సింగ్ 116వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్.ఎస్.యు.ఐ జిల్లా నాయకులు తెలుగు విజయ్ కుమార్, మాట్లాడుతూ భగత్ సింగ్ ఆనాడు పంజాబ్ లోని ప్రస్తుత పాకిస్తాన్లో ఉన్నటువంటి లాహోర్ పూర్ జిల్లాలోని బత్కర్ కలాం గ్రామంలో 1907 సెప్టెంబర్ 28న జన్మించాడన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం 23 సంవత్సరాలకే తెల్లదొరలకు వణుకు పుట్టించినటువంటి యువ నాయకులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్, దేశం కోసం ఉరికంబాన్ని ముద్దాడి ప్రాణాలను సైతం అర్పించిన భారత ముద్దుబిడ్డలని కొనియాడారు. దేశానికి స్వేచ్ఛ వచ్చిందని భావించిన విద్యా విధానంలో మాత్రం స్వేచ్ఛ రాలేదని ఎన్.ఎస్.యు.ఐ నంద్యాల జిల్లా నాయకులు తెలుగు విజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాడు భగత్ సింగ్ తెల్లదొరలతో స్వాతంత్రం కోసం పోరాడితే , ఈనాడు విద్యారంగంలోని సమస్యల కోసం ఈ నల్ల దొరలతో విద్యార్థులు పోరాడవలసి వస్తుందని ఆగ్రహ వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో విద్యార్థులు ప్రభుత్వంపై పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్.ఎస్.యు.ఐ నాయకులు తేజ, మధు ,చరణ్, మధు కృష్ణ, లక్ష్మీనారాయణ, రవి, గని మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Dhone: షహీద్ భగత్ సింగ్ జయంతి వేడుకలు
యువ నాయకులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES