Wednesday, January 8, 2025
Homeఆంధ్రప్రదేశ్CM Chandrababu: పింఛన్ల పంపిణీ.. లబ్ధిదారుడి ఇంట్లో కాఫీ పెట్టిన సీఎం చంద్రబాబు

CM Chandrababu: పింఛన్ల పంపిణీ.. లబ్ధిదారుడి ఇంట్లో కాఫీ పెట్టిన సీఎం చంద్రబాబు

ఏపీ వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. నూతన సంవత్సరం కానుకగా ఓ రోజు ముందే పింఛన్లను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, మిగిలిన ప్రజాప్రతినిధులు తమ తమ నియోజకవర్గాల్లో పాల్గొని పింఛన్లు లబ్ధిదారులకు అందిస్తున్నారు.

- Advertisement -

ఈ క్రమంలోనే పల్నాడు జిల్లా యల్లమందలో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ముందుగా గ్రామస్థులతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం తలారి సారమ్మ అనే లబ్ధిదారి ఇంటికి వెళ్లి ఆమెకు వితంతు పింఛన్ అందజేశారు. ఆమె పిల్లలకు కూడా మంచి చదువు చెప్పించాలని అధికారులను ఆదేశించారు. ఆమె కుమారుడికి ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రూ. లక్ష రుణం ఇప్పించాలని సూచించారు.

ఆ తర్వాత మరో లబ్ధిదారుడు ఏడుకొండలు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలుకరించారు. ఈ నేపథ్యంలో వారి ఇంట్లో స్వయంగా కాఫీ పెట్టి అందరికీ అందజేశారు. వారి కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అతను దుకాణం పెట్టుకునేందుకు బీసీ కార్పొరేషన్ ద్వారా రూ.5 లక్షల రుణం ఇప్పించాలని… అలాగే ఇంటి నిర్మాణం పూర్తి కోసం కూడా రుణం ఇప్పించాలని అధికారులను ఆదేశింశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా పెన్షన్ల పంపిణీలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా 5,402 మంది వితంతు పెన్షన్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే పెన్షన్ మంజూరు విధానంలో కూడా స్వల్ప మార్పులు చేసింది. మూడు నెలల పాటు వివిధ కారణాలతో పెన్షన్ తీసుకోని 50 వేల మందికి సైతం పింఛన్ పంపిణీ చేస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News