వైసీపీ ప్రభుత్వ హయాంలో కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్, కాకినాడ సెజ్‌లోని వాటాలను బలవంతంగా లాగేసుకున్న కేసులో నిందితులపై ఈడీ ఉచ్చు బిగిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తనయుడు వైవీ విక్రాంత్ రెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
- Advertisement -
తాజాగా వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డికి(Vijayasai Reddy) కూడా నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు విజయసాయిరెడ్డి అల్లుడు సోదరుడు పెనక శరత్ చంద్రారెడ్డి, పీకేఎఫ్ శ్రీధర్, ఎల్‌ఎల్‌పీ ప్రతినిధులకు నోటీసులు అందజేసింది. అయితే ఈడీ నోటీసులపై విజయసాయి రెడ్డి ఇంకా స్పందించలేదు.