ఏపీలో ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. గుంటూరు జిల్లా ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో డైరెక్టర్ల మధ్య రేగిన ఆధిపత్య పోరు ఈడీ దాడుల వరకూ వచ్చింది. గుంటూరు, విజయవాడల్లోని ఎన్ఆర్ఐ ఆస్పత్రుల్లో సోదాలు చేసి.. కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్‌ఆర్‌ఐ సొసైటి సభ్యురాలు అక్కినేని మణి టార్గెట్‌గా ఈడీ సోదాలు జరుగుతున్నాయి. విదేశీ నిధులు సొంత ఖాతాలకు మళ్లింపు, కరోనా సమయంలో పేషెంట్ల నుంచి ఇష్టారాజ్యంగా వసూళ్లు, ఎన్‌ఆర్‌ఐ నిధులతో విజయవాడ అక్కినేని ఉమెన్స్ ఆస్పత్రికి వైద్య పరికరాలు కొన్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఇప్పుడు ఈడీ వీటిపైనే దృష్టిసారించింది. కాగా.. గతంలో అవినీతి ఆరోపణలతో అరెస్టైన నిమ్మగడ్డ ఉపేంద్ర.. ఈడీ దాడులు జరుగుతాయన్న ముందస్తు సమాచారంతో.. నిమ్మగడ్డ ఉపేంద్ర పరారయ్యాడు. దాంతో ఐటీ అధికారులు ఆయన ఇంటిని సీజ్ చేశారు. అక్కినేని మణితో పాటు సొసైటీ సభ్యులు నళిని మోహన్, ఉప్పాల శ్రీనివాసరావుల ఆర్థిక వ్యవహారాలపై ఈడీ అధికారులు దృష్టి సారించారు. NRI ఆస్పత్రికి విదేశీ నుండి వచ్చిన నిధులను ఆస్పత్రి అవసరాలకు కాకుండా.. అక్కినేని మణి తన సొంత ఆస్పత్రికి మళ్లించారని తెలుస్తోంది.