Saturday, July 27, 2024
Homeఆంధ్రప్రదేశ్Election Commission: ఈ నెలాఖరుకల్లా ఎలక్షన్ ట్రైనింగ్ పూర్తి చేయండి

Election Commission: ఈ నెలాఖరుకల్లా ఎలక్షన్ ట్రైనింగ్ పూర్తి చేయండి

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ త్వరలో ప్రకటించనున్న నేపథ్యంలో అన్ని రకాల బృందాల శిక్షణా కార్యక్రమాలను ఈ నెలాఖరు కల్లా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. శనివారం రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ఆయన మీడియో కాన్పరెన్సు నిర్వహించి ఎన్నికల సంసిద్దతకు, ఓటర్ల జాబితా నవీకరణకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు.

- Advertisement -

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే అమల్లోకి వచ్చే ఎన్నికల నియమావళి ప్రకారం ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటిక్ సెర్వెలెన్స్ టీములు, వీడియో వ్యూయింగ్ టీములు, ఎలక్షన్ ఎక్స్పెండిచర్ మేనేజ్మెంట్ టీములు మరియు ఇతర బృందాల కార్య కలాపాలు ప్రారంభం అవుతాయన్నారు. ఈ నేపథ్యంలో ఆయా బృందాలు నిర్వహించాల్సిన విధులపై సమగ్ర అవగాహన కలిగి ఉండాల్సిన ఆవసరం ఎంతో వుందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో వుంచుకొని అన్ని రకాల బృందాల శిక్షణా కార్యక్రమాలను ఈ నెలాఖరులోపు పూర్తిచేయాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు ఆయన సూచించారు. ఎన్నికల నిర్వహణ, కౌంటింగ్ లో పాల్గొనే అధికారులు, సిబ్బంది కి అవసరమైన శిక్షణా కార్యక్రమాలను మార్చి మాసంలో నిర్వహించుకోవచ్చన్నారు.

పలువురు అధికారులను ఆర్.ఓ.లుగా, ఏ.ఆర్.ఓ.లుగా, ఇ.ఆర్.ఓ.లుగా, ఏ.ఇ.ఆర్.ఓ.లుగా అన్ని జిల్లాలో నియమించడం జరిగిందని, అయితే ఇంకా ఎవరైనా వారి విధులో ఇప్పటి వరకూ చేరకుంటే, అటు వంటి వారి వివరాలను తమ వెంటనే తెలియజేస్తే ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఓటర్ల కు సౌకర్యాలు కల్పించే కేంద్రాలు, హోమ్ ఓటింగ్ బృందాలకు తగినంత మంది సిబ్బందిని సమకూర్చుకోవాలని సూచించారు. విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్దులకు హోమ్ ఓటింగ్ కు అవకాశం ఉన్న నేపథ్యంలో రెవిన్యూ అధికారులు, సిబ్బందితో హోమ్ ఓటింగ్ బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. పోలింగ్ సిబ్బంది డాటాను సంబందిత పోర్టల్ లో వెంటనే ఫీడ్ చేయాలన్నారు.

ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ను పటిష్టంగా అమలు పర్చేందుకై సంబందిత రెగ్యులేటరీ అథారిటీలతో సమన్వయంతో వ్యవహరిస్తూ ఉండాలని, ప్రతి అథారిటీ నుండి తప్పని సరిగా ఒక నోడల్ అధికారి వుండేలా చూసుకోవాలన్నారు. ఇ.వి.ఎం.లను తరలించే వాహనాలతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటిక్ సెర్వెలెన్స్ టీములు, వీడియో వ్యూయింగ్ టీములు మరియు ఇతర బృందాల వాహనాలకు తప్పని సరిగా జి.పి.ఎస్. సౌకర్యం ఉండాలని సూచించారు.

కమ్యూనికేషన్ ప్లాన్ అమల్లో భాగంగా జిల్లా కేంద్రం నుండి బ్లాక్ స్థాయి వరకూ ఉండే అందరి అధికారులతో పటిష్ఠమైన కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి, సమస్యాత్మమైన పోలింగ్ స్టేషన్లు అన్నింటికీ తప్పని సరిగా మైక్రో అబ్జర్వర్లను నియమించాలని, వెబ్ కాస్టింగ్ తో పాటు మీడియో గ్రఫీ కవరేజ్లో ఆయా పోలింగ్ కేంద్రాల పరిసరాలను కూడా చిత్రీకరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అందుకు అవసరమైన వీడియో గ్రాఫర్లను, జిల్లా స్థాయిలోనే సమకూర్చుకోవాలన్నారు. పలు రకాల యాప్ల వినియోగాన్ని విస్తృస్థాయిలో పెంచేందుకు టెక్నాలజీ వినియోగ ప్రణాళికను పటిష్టంగా అమలు పర్చాలన్నారు.

ఈ సమావేశంలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో పాటు అదనపు సీఈవోలు పి. కోటేశ్వరరావు, ఎమ్.ఎన్. హరెంధిర ప్రసాద్, జాయింట్ సీఈవో ఎ.వెంకటేశ్వరరావు, డిప్యూటీ సీఈవో కె. విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News