అత్త బుట్టా రేణుకపై ఉన్న కోపం, కుటుంబ కలహాలతోనే మాచాని డాక్టర్ సోమనాథ్ ఎమ్మిగనూర్ టిడిపి సీటు కావాలనుకోవడం సిగ్గు చేటు అని ఎమ్మిగనూరులో బిసి సంఘాల ఐఖ్య వేదిక పేరుతో అద్దె నాయకులతో సమావేశం ఏర్పాటు చేయించారని, టిడిపి పట్టణ నాయకులు దయాసాగర్,మిఠాయి నరసింహులు, దామ నరసింహులు, రామదాసు గౌడ్,రామకృష్ణ నాయుడు, రంగస్వామి గౌడ్, కలిముల్లా, నజీర్ అహ్మద్ అన్నారు.
వాళ్లెవరో తెలీదు..
స్థానిక టిడిపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అద్దె ఉద్యమ కారులు అంతా కలిసి అద్దె మైకులలో మాట్లాడిన వారు ఏ పార్టీ వారో తెలియదు. సోమనాథ్ డబ్బు సంచులతో టికెట్ తెచ్చుకొని గెలవాలని ఆశించడం మూర్ఖత్వం. సోమనాథ్ కు సీటు అడిగిన వారికి గానీ, సోమనాథ్ కు టిడిపితో సంబంధం లేదు. బిసిలకు సీటు అడగటం తప్పు కాదు. పార్టీకు, ప్రజలకు ఏం సేవ చేశారని అడుగుతున్నారు. ఓసీ, ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనారిటీ అనేది ముఖ్యం కాదు ప్రజా బలం ఉన్న బీవీ జయనాగేస్వర రెడ్డి లాంటి ప్రజా సేవకుడు కే టికెట్ ఇవ్వాలి. 40 ఏళ్లుగా ఎమ్మిగనూరు ప్రజలకు సేవలు అందించిన బీవీ కుటుంబానికి బిసిలు అండగా ఉన్నారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో టిడిపి టికెట్ ఆశిస్తున్నానని చెప్పుకునే సోమనాథ్ ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నారు.
బీవీ త్యాగాలు మరువలేం..
జగన్ మోహన్ రెడ్డి అరాచక పాలనను ఎదుర్కొంటూ టిడిపి నాయకులు కార్యకర్తలను కాపాడిన బీవీ జయనాగేశ్వర రెడ్డి త్యాగాలను మరిచిపొలేమన్నారు. సోమనాథ్ కేవలం 2 నెలలు ముందు వచ్చి టిడిపి సీటు కావాలని అడగటం వెనక అత్త మీద కోపం తప్ప ప్రజలపై ప్రేమ లేదు. పెయిడ్ ఆర్టిస్టులను పంపి కుట్రలు చేసినా బీవీను అడ్డుకోలేరు. బీవీకే సీటు వస్తుంది. బీవీ విజయం సాధించి చంద్రబాబుకు కానుకగా ఇస్తాం. సమావేశంలో టిడిపి నాయకులు హుసేన్ పీర, మునీర్, దేవేంద్ర, శాబీర్, నాగేష్ ఆచారి, బిజ్జే నాగరాజు, మిన్నల్లా, మాబు, వడ్డే కృష్ణ, బోయ హమాలీ ఉరుకుందు, రంగన్న, లడ్ల నరసింహులు, కుమ్మరి శ్రీనివాసులు, గాజుల సుధాకర్ పాల్గొన్నారు.