Tuesday, October 8, 2024
Homeఆంధ్రప్రదేశ్Pathikonda: ప్రచారం ఉధృతం చేసిన శ్యామ్ కుమార్

Pathikonda: ప్రచారం ఉధృతం చేసిన శ్యామ్ కుమార్

మేనిఫెస్టోను వివరించిన కేఈ

పత్తికొండ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కే. ఈ. శ్యామ్ కుమార్ పట్టణంలోనే లక్ష్మి టాకీస్ వెనక వున్న లక్ష్మి నగర్ కాలనీలో పర్యటిస్తూ బాబు షూరిటి-భవిష్యత్తు గ్యారీంటీలపై టీడీపీ ప్రకటించిన సంక్షేమ పథకాలను ప్రతి ఇంటిని తడుతూ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మినీ మేనిఫెస్ట్ పథకాల గురించి ప్రజలకు క్షుణ్ణంగా తెలియజేస్తూ, రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా ప్రతి పథకం ప్రజలకు అందాలన్నా రాష్ట్రంలో కచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలవాలి అన్నారు. మినీ మేనిఫెస్ట్ పథకాలు, మహాశక్తి పథకం కింద తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి రూ 15,000 వంటి ఎన్నో అంశాలతో కూడిన మేనిఫెస్టో పత్రాలను ప్రజలకు అందజేశారు. ప్రతి ఓటర్ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అఖండ విజయంతో గెలిపించాలని ప్రజలకు సూచించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో ఈడిగ శ్రీనివాసులు గౌడ్, హరిబాబు, విజయ మోహన్ రెడ్డి, మీరా హుసేని, చౌదరి, నియోజకవర్గ నాయకులు, మండల నాయకులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News