Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Emmiganuru: గుడికల్ యువకులు భయంకర విన్యాసాలు

Emmiganuru: గుడికల్ యువకులు భయంకర విన్యాసాలు

ప్రతి ఏటా ప్రత్యేక సాహసాలు

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడికల్ గ్రామ యువకులు భయంకర విన్యాసాలు చేసి ప్రజలను ఆకర్షించారు. గుడికల్ గ్రామంలోని రుద్రగౌడ్ నివాసం ముందు గుడికల్ యువకులు వివిధ రకాల విన్యాసాలు చేశారు. ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలు చేయడం ఆ యువకుల ప్రత్యేకం.

- Advertisement -

ప్రతి ఏటా దసరా పండుగ సందర్భంగా విన్యాసాలు చేయడం ఆనవాయితీ. శరీర భాగాలపై ఇనుప చువ్వలు గుచ్చుకొని గాలిలో తేలాడారు. కాళ్ళు, చేతులు, వీపు వెనక భాగం, స్వరపేటిక, ఊపిరి పీల్చుకునే గుండెలు ఉండే శరీర భాగాలపై కడ్డీలు గుచ్చుకొని విన్యాసాలు చేశారు. రోడ్డుకు ఎదురెదురుగా ఉండే ఇళ్ళ మధ్య నిచ్చెన వేసుకొని శరీరరంపై ఇనుప కడ్డీలు గుచ్చుకొని దానిపై నడుస్తూ గ్యాస్ సిలిండర్ ను పైకి ఎత్తారు.

డ్రమ్ముపై కత్తుల లాగా పదునుగా ఉండే ఇనుప కడ్డీలుపై పడుకొని అబ్బుర పరిచే సాహస విన్యాసాలు చేయడం చూపరులను ఆకర్షించాయి. ప్రతి ఏడాది ఏదో ఒక ప్రత్యేక విన్యాసం చేయడం ఆ యువకులకు చెందుతుంది. అబ్బుర పరిచే సాహస విన్యాసాలు చేసిన యువకులను వైసిపి నేత రాష్ట్ర వీర శైవ లింగాయిత్ కార్పొరేషన్ చైర్మన్ వై రుద్రగౌడ్, వైసిపి యూత్ లీడర్ వై కుమార్ గౌడ్, డాక్టర్ గౌడప్ప గౌడ్, డాక్టర్ నవీన్ లు అభినందించి బహుమతులు అందజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News