Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Emmiganuru: పొత్తు కుదిరితే పోటీకి సిద్దం

Emmiganuru: పొత్తు కుదిరితే పోటీకి సిద్దం

బిజెపి కన్వీనర్ కేఅర్ మురహరి రెడ్డి

రాష్ట్రంలో తెదేపా బిజేపి మధ్య పొత్తు కుదిరితే ఎమ్మిగనూరు నుండి పోటీ చేయడానికి సిద్దంగా ఉన్నట్లు సీటు వస్తే గెలిచి చూపిస్తానని బిజేపి కన్వీనర్ కేఅర్ మురహరి రెడ్డి అన్నారు. స్థానిక బిజేపి కార్యాలయంలో మురహరి రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో బిజేపి బలంగా ఉంది. రాష్ట్ర బిజెపి చీఫ్ పురంధ్రీశ్వరి అధ్వర్యంలో బిజేపి బలపడింది. బూత్ కమిటీలు, శక్తి కేంద్రాలు ఏర్పాటు చేసి నిర్మాణాన్ని పటిష్టం చేశాం. సిఎం జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక బటన్ నొక్కడం డబ్బులు వేయడం తప్ప అభివృద్ధి లేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను పక్కదారి పట్టించి పేర్లు మార్చి పబ్బం గడుపుకుంటుంది.వై నాట్ 175 అంటున్నారు. ఎందుకు 175 గెలిపించాలని ప్రశ్నించారు. ప్రజలపై భారం వేసినందుకు గెలిపించాలా ?అన్నారు.

- Advertisement -

వైకాపా కుల మాతాలను విభజించి ఓట్ల రాజకీయం చేస్తుంది. రాష్ట్రంలో బిజేపి రాజ్యాధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మిగనూరులో వైకాపా సమన్వయ కర్త బుట్టా రేణుక ప్రోటోకాల్ పాటించడం లేదు. ఏ అధికారంతో ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొంటారు అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆసుపత్రి సూపర్డెంట్ కూర్చోవాల్సి కుర్చీలో బుట్టా రేణుక ఏలా కూర్చుంటారు. ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డిను కూడా ప్రక్క సీట్లో కూర్చోబెట్టి అవమానించడం వైకాపా పాలనకు నిదర్శనం. వచ్చే ఎన్నికల్లో వైకాపాను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. సమావేశంలో బిజేపి జిల్లా ఉపాధ్యక్షుడు బీఎల్ నారాయణ, పట్టణ అధ్యక్షుడు కిరణ్ కుమార్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News