Friday, June 28, 2024
Homeఆంధ్రప్రదేశ్Emmiganuru: బీజేపీ నుంచి వైసీపీలోకి చేరికలు

Emmiganuru: బీజేపీ నుంచి వైసీపీలోకి చేరికలు

80 మంది బుట్టా రేణుక సమక్షంలో చేరిక

నందవరం మండలం నాగలదిన్నె గ్రామానికి చెందిన బిజేపి కు చెందిన 80 మంది వైసిపిలో చేరారు. స్థానిక శిల్పా ఎస్టేట్ కాలనిలోని వైకాపా కార్యాలయంలో వైసిపి అభ్యర్థి బుట్టా రేణుక సమక్షంలో బిజేపి నాయకులు మాల రుద్రయ్య, జీవరత్నం,అంజి, రంజిత్ కుమార్, ఈరన్న ప్రవీణ్ కుమార్ తో పాటు మరో 80 మంది వైసిపి కండువాలు వేసుకున్నారు. వీరికి బుట్టా రేణుక వైసిపి కండువాలు వేసి ఆహ్వానించారు.

- Advertisement -

ఈ సందర్భంగా బుట్టా రేణుక మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైకాపా విజయానికి నిరంతరం కృషి చేయాలని సూచించారు. నా విజయం కోసం పని చేయండి, గెలిచాక మీ సమస్యలు పరిష్కారం చేసే బాధ్యత నాది అని అన్నారు.

కార్యక్రమంలో వైసిపి నాయకులు బుట్టా శివ నీలకంఠ, బుట్టా ప్రతుల్, కనకవీడు పేట శ్రీనివాస రెడ్డి, నాగలదిన్నె వైసిపి నాయకులు ఆకుల రాజా శరత్ కుమార్, మాజీ సర్పంచ్ కృష్ణ మూర్తి, ప్రభాకర్, సర్పంచ్ తిమ్మప్ప, అతావుల్లా, లింగమూర్తి, బొంబాయి రాజు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News