Thursday, September 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Emmiganuru: భవిష్యత్ తరాలకు సారవంతమైన భూమిని అందిద్దాం

Emmiganuru: భవిష్యత్ తరాలకు సారవంతమైన భూమిని అందిద్దాం

పంట దిగుబడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న వ్యవసాయ పనిముట్లను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన రైతులకు వివరించారు. ఎమ్మిగనూరు మండలం కందనాతి ప్రాజెక్టు పరిధిలోని గ్రామాల రైతులకు ‘ప్రధానమంత్రి కృషి సంచాయీ యోజన’ ఆధ్వర్యంలో ఉత్పాదకత పెంపుదల పిఎస్ఐ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ పనిముట్లు జిల్లా కలెక్టర్ డా.జి.సృజన పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కందనాతి ప్రాజెక్టు, కడివెళ్ళ మైక్రోవాటర్ షెడ్ గ్రామాలు, వాటి అవాస గ్రామాల్లోని రైతులకు పంట దిగుబడి పెంచేందుకు గాను వాటర్ షెడ్ డెవలప్మెంట్ కాంపోనెంట్-ప్రధానమంత్రి కృషి సంచాయీ యోజన 2.0 (PMKSY 2.0) ద్వారా రైతులకు అవసరమైన వ్యవసాయ పనిముట్ల ద్వారా చేయూతను అందించడం జరిగిందన్నారు. అందులో భాగంగా కందనాతి, మసీదపురం, వెంకటగిరి, మాచుమాన్ దొడ్డి, కడివెళ్ళ, ఎస్.నాగలాపురం గ్రామాలకు చెందిన 310 మంది రైతులు లబ్ధి పొందడం జరిగిందన్నారు. ఉత్పాదకత పెంపుదల క్రింద రూ.1.58కోట్లు మంజూరు చేయడం జరిగిందని, అందులో మొదటి విడతగా రూ.64లక్షలు మంజూరు అయ్యాయని, అందులో రైతుల వాటా (ఎస్సీ/ఎస్టీ-10%, బిసి/ఇతర కులాలకు-20%) రూ.14.65లక్షలు కలిపి రైతులకు అవసరమైన వ్యవసాయ పనిముట్లను అందజేయడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం రైతులకు అవసరం అయ్యే తైవాన్ స్పేయర్లు (4స్ట్రోక్), ఆయిల్ ఇంజిన్ (5హెచ్పి), టార్పాలిన్లు, వాటర్ క్యారియింగ్ పైపులు (90ఎంఎం) అందుబాటులో ఉన్నాయని రైతులు వారి అవసరం మేరకు వీటిని సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందాలన్నారు. రైతులు పంట పొలాలకు ఎక్కువ శాతం క్రిమి సంహారక మందులు వాడడం ద్వారా మట్టిలో ఉండే సహజ గుణాలు కోల్పోతున్నాయన్నారు. ప్రతి నీటి చుక్కను కాపాడుకొని భద్రపరచుకొని పొలాల అవసరాలకు, వ్యక్తిగత అవసరాలకు కోసం వినియోగించుకోవాలన్నారు. భవిష్యత్తు తరాల కోసం ఏ విధంగా అందజేయాల్సిన వర్షపు నీటిని ఫాంపాండ్స్, ఛానెల్స్, చెరువుల రూపంలో నీటిని నిల్వ చేసుకోవడంతో పాటు ప్రభుత్వం అందిస్తున్న వ్యవసాయ పనిముట్లను సద్వినియోగం చేసుకొని పంట దిగుబడి చేసుకొని ఆదాయం పెంచుకొని జీవించాలన్నారు. వ్యసాయానికి సంబంధించిన పనిముట్లను పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని లబ్ధి పొందాలని కలెక్టర్ రైతులకు సూచించారు. ఉపాధి హామీ పనులకు 60 నుంచి 70 శాతం మహిళలు రావడం వల్ల ఈ పథకం వారి ద్వారానే ముందుకు వెళ్తుందన్నారు. మహిళలు స్వయం సహాయక సంఘాల ద్వారా కూడా కుటుంబాలను పోషించుకుంటూ ముందజలో ఉన్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా సుమారు 500 సర్వీసులను ఇంటి వద్దకే అందజేయడం జరుగుతుందన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమయ్యే విత్తనాల దగ్గర నుంచి వారు పండించిన పంటను అమ్మేంత వరకు వారికి అండగా ఉంటుందన్నారు. గ్రామాల్లోని ప్రజలు వలసలకు వెళ్లి అక్కడ ఉపాధి కోసం ఇబ్బంది పడకుండా వారి వారి గ్రామాల్లో ప్రభుత్వం అందిస్తున్న పథకాల సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలన్నారు. అందుకోసం మనమందరం కలిసికట్టుగా గ్రామాలను అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని కలెక్టర్ గ్రామస్తులకు సూచించారు.
అనంతరం రైతులకు అవసరమైన వ్యవసాయ పనిముట్లను జిల్లా కలెక్టర్ వారికి పంపిణీ చేశారు. కార్యక్రమంలో వాటర్ షెడ్ కమిటీ ఛైర్మన్ బుడ్డన్న, డ్వామా పిడి అమర్నాథ్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News