ఎమ్మిగనూరు అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎమ్మిగనూరు నియోజకవర్గ బిజేపి కన్వీనర్ కేఅర్ మురహరి రెడ్డి ( బిజేపి) ఉమ్మడి అభ్యర్థి గా నామినేషన్ వేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో కే అర్ మురహరి రెడ్డి తన నామినేషన్ ప్రత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి చిరంజీవికు అందజేశారు. ఎమ్మిగనూరు పట్టణం హెచ్బీఎస్ కాలనీ లోని బిజేపి కార్యాలయం నుండి వేలాది మంది బిజేపి, జనసేన, టిడిపి నాయకులు కార్యకర్తలతో కలిసి జెండాలు చేత పట్టుకొని భారీ ర్యాలీ చేపట్టారు. మురహరి రెడ్డి ప్రత్యేక వాహనంపై అభివాదం చేస్తూ సోమప్ప సర్కిల్ వరకు ర్యాలీగా వచ్చారు. బిజేపి నాయకులు కిరణ్ కుమార్, బీఎల్ నారాయణ, న్యాయవాది సురేష్ తో పాటు శివ కుమార్ (జనసేన) లు మురహరి రెడ్డి వెంట అర్ఓ ఆఫీసు వెళ్లారు.
ఏప్రిల్ 18 వ తేదీన వైసిపి అభ్యర్థి బుట్టా రేణుక, టిడిపి అభ్యర్థి బీవీ జయనాగేశ్వర రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాన పార్టీలు కు హాజరైన తరహాలో మురహరి రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి హాజరు అయ్యారు. దీంతో తీవ్ర చర్చనీయ అంశంగా మారింది. కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి సుధా నాయుడు, ఎమ్మిగనూరు మండల అధ్యక్షుడు బనవాసి కురువ రాముడు, మండల ప్రధాన కార్యదర్శి లు బీమేష్,ఓబులేసు నాయుడు, దస్తగిరి, గురు, జన సేన చేనేత రాష్ట్ర కార్యదర్శి శివ కుమార్, గోనెగండ్ల కరణం రవి కుమార్, మోహన్, గోపి, బజరి,, యల్లప్ప, షబ్బీర్, టిడిపి నాయకులు బనవాసి ముక్కి ఈరన్న, ఈరన్న, నాగరాజు, రమేష్,జయరామ్, , కౌలట్లయ్య టిడిపి, బిజేపి, జనసేన, శ్రేణులు పాల్గొన్నారు.