రైతులు ఏరువాక పౌర్ణమిని ఘనంగా జరుపుకున్నారు. హొళగుందతో పాటు కొగిలాతోట, వందవాగాలి, గజ్జెహళ్లి, సులువాయి, హెబ్బటం గ్రామాల్లో రైతులు పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఎద్దులకు ప్రత్యేక అలంకారణాలు చేసి పూజలు నిర్వహించారు. హొళగుందలో టీడీపీ నాయకుడు కుడ్లురు ఈరప్ప కు చెందిన ఎద్దులు గెలుపొందాయి. గ్రామంలోని పుర వీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమాల్లో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ఆలూరు సిఐ వెంకటేశ్వర్లు, హొళగుంద ఎస్ ఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో గట్టి బందోబస్తూ ఏర్పాటు చేశారు.
