Sunday, November 16, 2025
Homeఆంధ్రప్రదేశ్Perni Nani: పేర్ని నాని సంచనల వ్యాఖ్యలు.. చీకట్లోనే రప్పా రప్పా అంటూ..!

Perni Nani: పేర్ని నాని సంచనల వ్యాఖ్యలు.. చీకట్లోనే రప్పా రప్పా అంటూ..!

Perni Nani comments: ప్రస్తుతం వైసీపీ శ్రేణులు “రప్పా.. రప్పా..” ట్యాగ్లైన్‌తో రాజకీయాలను చేస్తున్నారు. ఎన్నికల్లో ఎదురుదెబ్బ తిన్న తర్వాత పార్టీ ప్రతినిధులు.. ప్రతిపక్ష నాయకులపై విపరీతమైన పద ధోరణితో విరుచుకుపడుతున్నారు. బహిరంగంగానే హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నట్లు వారి ప్రసంగం ద్వారా అర్థం చేసుకోవచ్చు. మొన్న మాజీ సీఎం జగన్ రప్పా రప్పా అనే కామెంట్లు చేసినప్పటి నుంచి ఇతర నేతలు కూడా అంతే దురుసుగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా మాజీ ఎంపీ పేర్ని నాని సైతం రప్పా రప్పా కామెంట్లతో విరుచుకుపడ్డారు.

- Advertisement -

ఇటీవల జరిగిన వైసీపీ కార్యకర్తల సమావేశంలో పేర్ని నాని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. “రప్పా రప్పా అంటూ ఒపెన్‌గా కామెంట్ చేయడం మానేయండి” అని కార్యకర్తలకు ఫ్రీ హ్యాండ్‌ ఇచ్చినట్లు సూచించారు. బదులు, “చీకట్లో కన్ను కొడితే జరిగిపోవాల్సిందే, పట్టపగలు చెప్పాల్సిందేమీ లేదు” అని వ్యాఖ్యానించారు. దీని అర్థం? ఏదైనా చేయాలనుకుంటే ఓపెన్‌గా మాట్లాడకండి.. చీకట్లో తప్పకుండా చేయండి అని అర్ధం. ఈ మాటలు గూఢంగా మర్డర్ ప్లాన్‌లను వైసీపీ ప్రోత్సహిస్తున్నట్టు అనిపిస్తోందని విశ్లేషకులు విమర్శిస్తున్నారు.

ఏపీ మైదానం మరోసారి వేడెక్కిందా?

ఈ వ్యాఖ్యలతో పాటు నాని “ఎర్ర బుక్కు”పై కూడా సెటైర్లు వేయడంతో టీడీపీ నేతలు ఆగ్రహానికి లోనపైనట్లు తెలుస్తోంది. “జగన్ 2.0 లో మిత్తితో సహా చెల్లిస్తామని” ఇచ్చారు. నాని చేసిన ఈ వ్యాఖ్యలన్నీ కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. హత్యలు ప్లాన్ చేసి.. రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి తీసుకు రావాలని వైసీపీ నేతలు, జగన్ కుట్ర పన్నుతున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. రానున్న రోజుల్లో జగన్ అండతో వైసీపీ క్యాడర్ ఏదైనా అఘాయిత్యానికి పాల్పడే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. రాష్ట్రంలో శాంతియుత రాజకీయ వాతావరణం ఉండాలని, హత్యా రాజకీయాలను ప్రోత్సహించకూడదని చెబుతున్నారు. అలాగే హత్యలు ఎక్కువగా జరిగితే పెట్టుబడులు కూడా రావని పేర్కొంటున్నారు.

పేర్ని నాని వ్యాఖ్యలపై టీడీపీ నేతల ఘాటు విమర్శలు..

పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై పలువురు టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో స్పందించారు. పేర్ని నాని వ్యాఖ్యలు హత్యలను ప్రోత్సహించే విధంగా ఉందని చెబుతున్నారు. తమ పాలనను రాష్ట్రాన్ని మొత్తాన్ని నవ్వుల పాలు చేశారని.. ఇప్పుడు మరోసారి రాష్ట్ర పరువును తీసేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. వైసీపీ నేతలకు, కార్యకర్తలకు అధినేతకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో తమ నేతలకు, కార్యకర్తలకు కూడా తెలుసని పేర్కొన్నారు. జగన్ 2.0 జన్మలో జరగదని.. వైసీపీ, జగన్ పని పూర్తిగా అయిపోయిందని పేర్కొన్నారు. వైసీపీ నేతలు ఒక్కక్కడిగా పతనం అవుతున్నారని.. త్వరలోనే వైసీపీ కూడా పాతాళానికి వెళ్తుందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఏపీలో మరోసారి రాజకీయ వాతావరణం వేడెక్కిందని చెప్పుకోవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad