Sunday, November 16, 2025
HomeTop StoriesJobs for Youth: నిరుద్యోగుల కోసం ప్రత్యేకంగా 'నైపుణ్యం' పోర్టల్‌.. ప్రతినెలా జాబ్‌ మేళాలు..!

Jobs for Youth: నిరుద్యోగుల కోసం ప్రత్యేకంగా ‘నైపుణ్యం’ పోర్టల్‌.. ప్రతినెలా జాబ్‌ మేళాలు..!

Free Training For Unemployed Youth In AP: యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తూనే, వారి ఉన్నత విద్యకు సహకరించేలా ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. మంత్రి నారా లోకేష్‌తో పాటు ఆ శాఖ ఉన్నతాధికారులు సమీక్షకు హాజరయ్యారు. నైపుణ్యం పోర్టల్, జాబ్ డ్యాష్ బోర్డ్, వివిధ కోర్సులు, ఉద్యోగావకాశాలు తదితర అంశాలపై సమీక్షలో చర్చించారు. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి కోసం ఎదురుచూసే నిరుద్యోగుల కోసం రూపొందించిన ‘నైపుణ్యం’ పోర్టల్ ఉద్యోగాల గేట్ వేగా ఉండాలని అధికారులకు సూచించారు. 2029 కల్లా 20 లక్షలు ఉద్యోగాలు అందించాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని సాకారం చేసేలా అధికారులు కృషి చేయాలని కోరారు. ఇకపై ప్రతీ నెలా, ప్రతీ నియోజకవర్గంలో జాబ్ మేళాలు నిర్వహించాలని ఆదేశించారు. నవంబర్‌లో జరిగే భాగస్వామ్య సదస్సులోగా ‘నైపుణ్యం’ పోర్టల్ ప్రారంభించి, అందుబాటులోకి తీసుకురావాలన్నారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణ పొందిన వారికి ఇక నుంచి అధికారికంగా ధ్రువపత్రాలు జారీ చేయాలని తెలిపారు. కాగా, నైపుణ్యం పోర్టల్‌లో ఐటీఐలు, పాలిటెక్నిక్‌లు, ఇంజినీరింగ్ కళాశాలలు, యూనివర్సిటీలు, వివిధ విద్యా సంస్థలతో పరిశ్రమలు, సంస్థలను అనుసంధానించాలని కోరారు. ఈ పోర్టల్‌ ప్లేస్‌మెంట్‌ వివరాలనూ ట్రాకింగ్ చేసేలా ఉండాలని, స్కిల్ టెస్టింగ్‌కు కూడా అవకాశం కల్పించాలన్నారు. పాఠశాల స్థాయిలో విద్యార్ధుల నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేలా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌తో కలిగి పనిచేయాలన్నారు. విదేశాల్లో ఉద్యాగావకాశాలు సులభంగా పొందేందుకు వీలుగా ఆయా దేశాల స్థానిక భాషలను నేర్చుకునేలా శిక్షణ అందించాలని, ఏపీ ఎన్‌ఆర్టీ ద్వారా ఉద్యోగ సమాచారం పొందేలా చూడాలని కోరారు. నైపుణ్యం పోర్టల్ ద్వారా ఏపీలో యువత అందరికీ ఏ రంగంలో నైపుణ్యం కావాలో దానికి సంబంధించిన శిక్షణ, అలాగా వారి సామర్ధ్యాన్ని మెరుగుపరుచుకునేలా ఉత్తమ శిక్షణ అందించాలని కోరారు.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/ap-cabinet-postponed-to-november-10/

15 క్లస్టర్ల ద్వారా నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ

క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ ద్వారా నైపుణ్యాలను పెంచేలా ప్రయత్నిస్తున్నామని మంత్రి లోకేష్ అన్నారు. స్పేస్, ఆక్వా, క్వాంటం లాంటి రంగాల్లో సంస్థలు, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య శిక్షణ అందించేలా కార్యాచరణ చేపట్టినట్టు తెలిపారు. మొత్తం 15 క్లస్టర్ల ద్వారా పరిశ్రమలకు మానవ వనరుల్ని అందించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామని సీఎంకు వివరించారు. ఈ విధానంపై ఆస్ట్రేలియాలో అధ్యయనం చేసి అమలు చేస్తున్నామన్నారు. దేశ విదేశాల్లో ఉద్యోగాలు ఎక్కడ లభిస్తున్నాయో అందరికీ తెలిసేలా ‘నైపుణ్యం’ పోర్టల్ అభివృద్ధి చేయడమే కాకుండా, నైపుణ్య కల్పనలో దేశ, విదేశాలకు చెందిన సంస్థలను సంప్రదించాలని అధికారులను ఆదేశించారు. విశ్వవిద్యాలయాలు, జాతీయ-అంతర్జాతీయ విద్యా సంస్థలతో భాగస్వామ్యం ఏర్పర్చుకుంటే ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ప్రభుత్వం నుంచి ఏ లబ్ది పొందకుండా నిరుద్యోగులుగా ఉన్నవారికి ప్రయోజనం చేకూర్చేలా నైపుణ్యం పోర్టల్ తీర్చిద్దాలన్నారు. అభ్యర్ధులు నచ్చిన రంగంలో ఉపాధి పొందేలా అన్ని అన్ని వివరాలను పోర్టల్‌లో పొందుపర్చాలని సూచించారు.

అన్ని శాఖలకు నిరుద్యోగుల డేటా అనుసంధానం..

ఇప్పటివరకు రాష్ట్రంలో నిర్వహించిన జాబ్ మేళాల ద్వారా 1,44,000 మందికి ఉద్యోగాలు లభించాయని అధికారులు సీఎంకు తెలిపారు. నైపుణ్యం పోర్టల్ నుంచి ఏఐ ద్వారా అభ్యర్ధులు తమ రెజ్యూమ్ రూపొందించుకునే వెసులుబాటు కల్పించినట్టు వెల్లడించారు. వాట్సాప్ ద్వారా ఉద్యోగావకాశాల గురించి సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి అన్ని శాఖలు, విభాగాల డేటా బేస్‌ సమీకృతం చేసి నిజమైన నిరుద్యోగులను గుర్తిస్తున్నామన్నారు. ఉద్యోగార్దులు ఇంటర్వ్యూలకు సిద్ధమయ్యేలా ఏఐ సిమ్యులేటర్‌ను సైతం పోర్టల్‌లో పొందుపర్చినట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad