బనగానపల్లె నియోజకవర్గంలో కొలిమిగుండ్ల మండలం కోటపాడు గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. కోటపాడు గ్రామ వైయస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపి రెడ్డికి ఘన స్వాగతం పలికి గజమాలతో సత్కరించారు. ఇంటింటికి వెళ్లి వైయస్సార్ ప్రభుత్వం హయాంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల పనితీరు ఎలా ఉంది సంక్షేమ పథకాలు ఎలా అందుతున్నాయని ప్రజలతోనే స్వయంగా ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అడిగి తెలుసుకున్నారు. అనంతరం బనగానపల్లె నియోజకవర్గం లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా వైయస్సార్ పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకిచ్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేర్చిన రాజకీయ దురంధరుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఏ గ్రామానికి వెళ్లిన కూడా పెద్ద ఎత్తున ప్రజల నుంచి అనుహస్పందన లభిస్తుందని ప్రభుత్వ సంక్షేమ పథకాల పనితీరును ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. గ్రామ సచివాలయం వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తామన్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల పాటు కరోనా మహమ్మారితో రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ కుదైలైనప్పటికీ కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలకు అందించడం జరిగిందని ఎన్నికల ఎమ్మెల్యే హామీలు చెప్పాడో ఆ హామీలన్నింటిలో 98% మేరా నెరవేర్చినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దక్కుతుందని చెప్పారు. అభివృద్ధిలో బనగానపల్లె నియోజకవర్గం అభివృద్ధి పథం వైపు అడుగులు వేస్తుందని నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో అర్హులైన ప్రతి పేదవానికి సంక్షేమ ఫలాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ పార్టీ ప్రచార కార్యదర్శి సిద్ధం రెడ్డి రామ్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుండం సూర్యప్రకాశ్ రెడ్డి, నంద్యాల జిల్లా వైఎస్ఆర్ పార్టీ ప్రచార అధ్యక్షుడు పేరం సత్యనారాయణరెడ్డి, కొలిమిగుండ్ల మండల వైయస్సార్ పార్టీ కన్వీనర్ అంబటి గురువిరెడ్డి, పులి ప్రకాశ్ రెడ్డి, కోటపాడు గ్రామ ఎంపీటీసీ కళావతి, సర్పంచ్ సుంకమ్మ, సింగిల్ విండో చైర్మన్ మరియు గ్రామ సచివాలయ కన్వీనర్ ఈశ్వర్ రెడ్డి, ఉప సర్పంచ్ నాగిరెడ్డి, మూల వెంకటేశ్వర రెడ్డి, అధికారులు, వైయస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు, గ్రామ సచివాలయ సిబ్బంది, గ్రామవాలంటీర్లు పాల్గొన్నారు.