సాలూరు నియోజకవర్గంలో ప్రతిష్టాత్మక కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఎట్టకేలకు శంకుస్థాపన పూర్తి చేసుకుంది. సాలూరులో గిరిజన యూనివర్సిటీకి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అనంతరం మరడాంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం మరడాం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్, ముఖ్యమంత్రి వైయస్.జగన్ పాల్గొన్నారు.



