గోదావరి వరద ఉధృతి ధవళేశ్వరం వద్ద రేపటి నుంచి తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి డా.బిఆర్ అంబేద్కర్ తెలిపారు.
ఆదివారం రాత్రి 9 గంటలకు భద్రాచలం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందని నీటిమట్టం 49.5 అడుగులు ఉందన్నారు. ధవళేశ్వరం బ్యారేజి వద్ద వరద నిలకడగా ఉందని ప్రస్తుతానికి ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 16.32లక్షల క్యూసెక్కులు ఉందని రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందని తెలిపారు. సహాయక చర్యల్లో 4NDRF, 6SDRF బృందాలు ఉన్నాయన్నారు.
గోదావరి వరద ప్రభావిత జిల్లాల యంత్రాంగానికి ఎప్పటికప్పుడు సూచనలు జారీచేస్తున్నామని తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు.
పూర్తిస్థాయిలో వరద తగ్గే వరకు నదీ పరివాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లొతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.