తిరుమల(Tirumala) శ్రీవారి దర్శనార్థం వచ్చిన ఓ వ్యక్తి స్పెషల్ అట్రాక్షన్ అయ్యాడు. కొండపై భక్తులందరూ అతడి వైపు చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటారా..? అతడు ఎవరో కాదు తెలంగాణ గోల్డ్ మ్యాన్(Gold Man)గా గుర్తింపు పొందిన హోప్ ఫౌండేషన్ అధినేత కొండ విజయ్ కుమార్(Konda Vijay Kumar). ఒంటిపై రూ.4కోట్లు విలువ చేసే 5 కేజీల బంగారం వేసుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. రెండు చేతుల్లో వేళ్లకు సరిసమానంగా చేతి ఉంగరులు,రెండు చేతులకు భారీ కంకణాలు, బంగారు వాచీలు, మెడలో భారీ స్వర్ణాభరణాలతో ధరించారు.
బంగారు ఆభరణాలతో ఆలయానికి వచ్చిన విజయ్ కుమార్‌తో భక్తులు సెల్ఫీలు తీసుకునేందుకు ఆసక్తి ప్రదర్శించారు.గత మూడేళ్లుగా కుటుంబ సభ్యులు, హోప్ ఫౌండేషన్ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుంటున్నట్లు ఆయన తెలిపారు. కాగా గతంలోనూ విజయ్ కుమార్ దాదాపు 10 కిలోల బంగారు ఆభరణాలు ధరించి శ్రీవారిని విజయ్ కుమార్ దర్శించుకున్నారు.