విద్యార్థులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.600కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్(Fee Reimbursement) నిధులను విడుదల చేసింది. ఈమేరకు ఉన్నత విద్యాశాఖ సెక్రటరీ కోన శశిధర్ (Kona Shashidhar) ఓ ప్రకటన విడుదల చేశారు. త్వరలోనే మరో రూ.400 కోట్లు విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. ప్రైవేటు విద్యా సంస్థలకు దశల వారీగా బకాయిలను చెల్లిస్తున్నామని తెలిపారు.ఇప్పటికే తొలి విడతో రూ.788 కోట్లు రీయింబర్స్‌మెంట్ కింద నిధులు విడుదల చేసినట్లు పేర్కొన్నారు.
ఫీజుల కోసం విద్యార్థులపై కాలేజీ యాజమాన్యాలు ఒత్తిడి గురిచేయకూడదని సూచించారు. విద్యార్థులకు పరీక్షల సమయంలో హాల్ టికెట్లు ఇవ్వకుండా.. సర్టిఫికేట్లు అందించకుండా ఇబ్బంది పెడుతున్నట్లు తమ దృష్టికి వస్తే సదరు విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా వరుసగా ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
