కొన్ని రోజులుగా సూర్యుడి విజృంభణతో తీవ్ర ఉక్కపోతకు గురవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ అధికారులు చల్లటి కబురు చెప్పారు. ఏపీ, తెలంగాణలో రెండు, మూడు రోజుల పాలు వర్షాలు(Weather Report) పడతాయని తెలిపారు. అనేకచోట్ల ఈదురుగాలులతో కూడి వర్షం(Rains) పడుతుందని హెచ్చరించారు. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశముందని పశువుల కాపర్లు, పొలాలకు వెళ్లే రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. విదర్భ నుంచి తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని. సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఈ ఆవర్తనం కొనసాగుతోందన్నారు. వాతావరణం చల్లబడటంతో ప్రజలు కొంత సేదతీరుతున్నారు.
అయితే ఇదే సమయంలో అకాల వర్షంతో పంటలు దెబ్బతింటున్నాయి. ముఖ్యంగా, మామిడి, మొక్కజొన్న అరటి, బత్తాయి, నిమ్మ వంటి తోటలు దారుణంగా దెబ్బతిన్నాయి. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో రెండు రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని చెప్పడంతో మరింత ఆందోళన చెందుతున్నారు. అయితే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అకాల వర్షం ధాటికి అధికారులను అప్రమత్తం చేశారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామంటూ భరోసా ఇచ్చారు.