పేదలకు అండగా జగనన్న ఉన్నారని, జగనన్నకు తోడుగా మనమంతా నిలుద్దామని పిలుపునిచ్చారు మంత్రి గుమ్మనూరి జయరాం. విద్యార్థులకు మేనమామగా వృద్ధులకు పెద్ద కొడుకుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అండగా ఉంటారని మంత్రి అన్నారు. గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని వెలమకూరు గ్రామంలో గుమ్మనూరు సోదరులు శ్రీనివాసులు, నారాయణస్వామిలతో కలసి పాల్గొన్నారు. ముందుగా దేవనకొండ బస్టాండ్ వద్ద దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి 14వ వర్ధంతి సందర్భంగా వైయస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వెలమకూరు గ్రామంలో గ్రామస్తులు, మహిళలు,యువత మంత్రి గుమ్మనూరుకు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా గ్రామంలో ప్రకృతి వ్యవసాయ దారులకు 10వేల విలువైన విత్తనముల కిట్లు పంపిణీ చేశారు.గ్రామ పంచాయతీ పరిధిలోని సచివాలయం ద్వారా వెలమకూరు, కూకటికొండ, సింగాపురం గ్రామాల్లో సంక్షేమ పథకాల ద్వారా మొత్తం 9 కోట్ల 16 లక్షలు రూపాయలు లబ్ధి పొందారు అని తెలిపారు.జగనన్న సురక్ష వల్ల గ్రామంలో 520మందికి లబ్ధి పొందారు అన్నారు.10లక్షలతో వెలమకూరు గ్రామంలో సీసీ రోడ్డు, మరో 10లక్షలతో సింగాపురం, కూకటికొండ గ్రామాల్లో మౌలిక వసతుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయండి అని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు.18లక్షలతో జలజీవన్ మిషన్ ద్వారా వెలమకూరు గ్రామంలో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేపట్టి ప్రతి ఇంటికి త్రాగునీరు అందిస్తాము హామీ ఇచ్చారు.
ప్రభుత్వం పాఠశాల అభివృద్ధి కోసం నాడు నేడు కార్యక్రమం ద్వారా విద్యకు పెద్దపీట వేశారు అన్నారు. అనంతరం గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో డిఎస్పీ శ్రీనివాసరెడ్డి,సి.ఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి, జడ్పీటీసీ కిట్టు, తహశీల్దార్ వెంకటేష్ నాయక్,ఇంచార్జి ఎంపీడీఓ ఇదృష్ బాషా, ఈఓపిఆర్డీ సూర్యనారాయణ, ఏ.ఓ సురేష్ బాబు,ఏపీఎం రమేష్ బాబు, ఏ.పి.ఓ కృష్ణమూర్తి, పశువైద్యులు డా.వెంకటేష్, అర్దబ్ల్యూఎస్.ఏ.ఈ మురళీమోహన్, ముంబా, మండల కన్వీనర్ కప్పట్రాళ్ల మల్లికార్జున, ఎంపీటీసీ లక్ష్మీ దేవి, జిల్లా కార్యదర్శి రాంభీం నాయుడు, గ్రామ నాయకులు రామచంద్ర,రంగస్వామి, వీరభద్రి, అంజి, రంగన్న, లింగప్ప, లక్ష్మన్న, మండల నాయకులు, సచివాలయ సిబ్బంది అధికారులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.