Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Halaharvi: దమ్ముంటే పదవికి రాజీనామా చేయాలి

Halaharvi: దమ్ముంటే పదవికి రాజీనామా చేయాలి

జగన్ ను, విరుపాక్షిని విమర్శించే అర్హత నీకు లేదు

హాలహర్వి జెడ్పీటీసీ సభ్యుడు లింగప్ప పార్టీ కాకుండా పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో గెలిచి చూపించాలని వైఎస్సార్ సీపీ మండల‌ కన్వీనర్ రామిరెడ్డి, వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు తిప్పరెడ్డి అన్నారు. గురువారం వారు హాలహర్వి లో విలేకర్ల తో మాట్లాడారు. మంత్రి గుమ్మనూరు జయరాం కు టికేట్ రాక పోవడంతో జడ్పిటీసి లింగప్ప పార్టీ మారి టీడీపీ లోకి వెళ్లిడం సరికాదని వారు విమర్శించారు. నిట్రవట్టిలో పట్టుమని పది ఓట్లు కూడా లేని నీకు వార్డు నెంబర్ గా గెలవాడానికి అర్హులైన నీకు సీఎం జగన్ మోహన్ దయతో జడ్పీటీసీ పదవి వచ్చింది. తల్లి లాంటి పార్టీని వదిలి టీడీపీ లో కి చేరడం సిగ్గు చేటని వారు విమర్శించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం లో అభివృద్ధి జరగలేదడం విడ్డూరంగా ఉందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి బడుగు బలహీన వర్గాల ప్రజల ను అభివృద్ధి చేసిన ఘనత సీఎం జగన్ మోహన్ రెడ్డి కే దక్కుతుందని వారు తెలిపారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధి జరగలేదని జడ్పీటీసీ లింగప్ప అనడం సరికాదని వారు విమర్శిస్తున్నారు. సీఎం జగన్ మోహన్ పెట్టిన బిక్ష వల్ల నీకు జడ్పీటీసీ పదవి వచ్చిందని లింగప్ప గుర్తుచేసుకోవాలని వారు మండి పడ్డారు. ఆలూరు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ సమన్వయకర్త విరుపాక్షి కి ఏ గ్రామానికి వెళ్ళిన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వారు తెలిపారు. మచ్చిలేని నాయకుడు విరుపాక్షి అని వారు కొనియాడారు. మంత్రి గుమ్మనూరు జయరాం అండ చూసుకొని జడ్పీటీసీ లింగప్ప, మాజీ మండల కన్వీనర్ భీమప్ప చౌదరి భారీగా అవినీతి అక్రమాల కు పాల్పడ్డారని వారు తెలిపారు. విరుపాపురం లో దానవిక్రయం చేసిన భూమిని కబ్జా చేశారని వారు ఆరోపించారు. అలాగే బల్లూరు గ్రామంలో అధికారులపై ఒత్తిడి తెచ్చి 18 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి. బీ నామి పేర్లపై ఎక్కించుకున్నారని వారు‌ ఆరోపించారు. జడ్పిటీసి లింగప్ప, మాజీ మండల కన్వీనర్ భీమప్ప చౌదరి వల్ల పార్టీ కి చెడ్డపేరు వచ్చిందని వారు ఆరోపించారు. ఇలాంటి అవినీతి పరులకు వైఎస్సార్ సీపీ లో చోటు లేదని వారు తెలిపారు. భూ కబ్జాలకు పాల్పడిన జడ్పిటీసి లింగప్ప పై, మాజీ కన్వీనర్ బీమప్ప‌చౌధరి పై విచారణ చేయాలని స్పందన లో కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని వారు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News