Thursday, July 4, 2024
Homeఆంధ్రప్రదేశ్Heat wave: ఈ మండలాల్లో వడగాలుల తీవ్రత అధికం

Heat wave: ఈ మండలాల్లో వడగాలుల తీవ్రత అధికం

రేపు మన్యం జిల్లా కొమరాడ, వైఎస్ఆర్ జిల్లా చాపాడు,వీరపనాయునిపల్లె, కమలాపురం, వల్లూరు,ముద్దనూరు, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు మండల్లాలో వడగాల్పులు వీచే అవకాశం ఉంది.

- Advertisement -

మిగిలిన చోట్ల కూడా ఎండ ప్రభావం చూపే అవకాశం ఉంది.

ప్రజలు ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలి.

ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

ప్రయాణాల్లో ఉన్నవారు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి

-డా.బి.ఆర్ అంబేద్కర్, మేనేజింగ్ డైరెక్టర్, విపత్తుల నిర్వహణ సంస్థ.

☀ రేపు విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, SPSR నెల్లూరు, వైఎస్ఆర్, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 43°C – 44°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

• శ్రీకాకుళం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 41°C – 42°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

• విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 38°C – 40°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

బుధవారం నెల్లూరు జిల్లా వెంకటాచలంలో 46°C, తిరుపతి జిల్లా ఏర్పేడులో 46°C, పల్నాడు జిల్లా నర్సరావుపేటలో 45.9°Cల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనవి.

వైఎస్ఆర్ జిల్లా కడప, వీరపనాయునిపల్లె, వల్లూరు,ముద్దనూరు, మండల్లాలో తీవ్రవడగాల్పులు, మిగిలిన చోట్ల మొత్తం 38 మండలాల్లో వడగాల్పులు వీచాయి.

  • డా.బి.ఆర్ అంబేద్కర్, మేనేజింగ్ డైరెక్టర్, విపత్తుల నిర్వహణ సంస్థ.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News