శుక్రవారం (11-03-25) వడగాలులు(21) ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
రేపు వడగాలులు (21) వీచే అవకాశం ఉన్న మండలాలు:
పార్వతీపురంమన్యం జిల్లా-2, అల్లూరి-1, ఏలూరు-1, కృష్ణా -6, ఎన్టీఆర్-4, గుంటూరు-2, బాపట్ల-3, పల్నాడు-2 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. శనివారం 10 మండలాల్లో తీవ్ర, 69 మండలాల్లో వడగాలులు వీచేందుకు అవకాశం ఉందన్నారు.
మండలాల వివరాలు
గురువారం ప్రకాశం జిల్లా నందనమారెళ్ళలో 41.8°C, తిరుపతి జిల్లా వెంకటగిరిలో 41.1°C, చిత్తూరు జిల్లా నగరి, వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలో 41°C, నంద్యాల జిల్లా దొర్నిపాడు 40.8°C, విజయనగరం జిల్లా ధర్మవరంలో 39.9°C, అన్నమయ్య జిల్లా గంగరాజుపురం 39.8°C, కర్నూలు జిల్లా ప్యాలకుర్తి, నెల్లూరు జిల్లా తూర్పు రొంపిదొడ్ల 39.7°C, పల్నాడు జిల్లా అమరావతిలో 39.6°C చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైందన్నారు. 38 ప్రాంతాల్లో 40°Cకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డైనట్లు తెలిపారు.
ఎండతీవ్రంగా ఉండి బయటకు వెళ్లేప్పుడు తలకు టోపి, కర్చీఫ్ కట్టుకోవాలి, గొడుగు ఉపయోగించాలి. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని, శారీరక శ్రమతో కూడిన కఠినమైన పనులను ఎండలో చేయరాదని సూచించారు.
రేపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకపల్లి, కాకినాడ, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలకు అవకాశం ఉందన్నారు. మిగిలిన జిల్లాల్లో ఆకస్మాతుగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల క్రింద నిలబడరాదన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.