తిరుపతి జిల్లా …ఈ రోజు (05-12-2023) ఉదయము 8.50 గంటలకు నీటి మట్టము :- 197.30 అడుగులు ఉన్నది. నీటి మట్టము పెరిగినది ఆనకట్ట తలుపుల పైన 5.10 అడుగులు వెళుతున్నాయి. ఆనకట్ట ద్వారా 32,352.99 క్యూసెక్కుల నీళ్లు వెళుతున్నాయి.
మరోవైపు స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి వరద బాధితులకు అండగా నిలుస్తూ అవసరమైన ఏర్పాట్లను చేపడుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని, ఏ అవసరమొచ్చిన తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు భూమన.
పూలవాని గుంట, గొల్లవాని గుంట ప్రాంతాల్లో వరద బాధితులను పరామర్శించారు భూమన. పునరావాస కేంద్రాలకు తరలించిన వారితో పాటు అవసరమైన ప్రాంత ప్రజలకు పునరావాస కేంద్రాలకు రాలేని పరిస్థితి ఉన్నా సరే అలాంటి వారికి ఆహార పానియాలను అందజేయాలని తహశీల్దార్ వెంకట రమణను ఆదేశించిన భూమన… వీరి వెంట తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత తదితరులు పాల్గొన్నారు.