Home Minister Vangalapudi Anitha About YS Jagan Arrest: లిక్కర్ స్కామ్ కేసులో బిగ్ బాస్ ను అరెస్ట్ చేస్తారా అని మీడియా అడిగిన ప్రశ్నకు హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని అనిత బదులిచ్చారు. కాగా జగన్ నే బిగ్ బాస్ అంటూ టీడీపీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇక రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయని ఇటీవలే జగన్ అన్న వ్యాఖ్యలపై అనిత మండిపడ్డారు. ఆయన కార్యక్రమాలు సక్రమంగా జరగకపోతే ఎమర్జెన్సీ ఉన్నట్టా అని ప్రశ్నించారు. వైసీపీ పాలన ఎమర్జెన్సీని తలపించిందని విమర్శలు చేశారు.
జగన్ కు ఆ ఎమోషన్స్ ఉండవు…
అంతకుముందు హోం మంత్రి అనిత మాట్లాడుతూ.. మహిళలను కించపరిచే వాళ్లను ప్రోత్సహిస్తామనే ధోరణితో వైకాపా అధినేత జగన్ వ్యవహరిస్తున్నారంటూ పేర్కొన్నారు. మహిళలంటే జగన్‌కు గౌరవం లేదని ఆమె మండి పడ్డారు. తన తల్లి, చెల్లిపై ఎన్‌సీఎల్టీలో కేసు గెలిస్తే జగన్ సంబర పడిపోయారని, ఆయనకు తల్లి, చెల్లి అనే ఎమోషన్స్ ఉండవేమోనని విమర్శించారు.


