Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్Praveen Prakash: కార్పొరేట్ కాలేజెస్ Vs ప్రభుత్వ జూనియర్ కాలేజెస్

Praveen Prakash: కార్పొరేట్ కాలేజెస్ Vs ప్రభుత్వ జూనియర్ కాలేజెస్

ఇంటర్ హాల్ టికెట్స్ పంపిణీని గౌరవంగా భావిస్తున్నా

ఈ ఏడాది మార్చి1న జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరవుతున్న 10,52,221 మంది విద్యార్థులకు హాల్ టికెట్ల పంపిణీ ప్రక్రియను ప్రారంభించడం గౌరవంగా ఉందని పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యా సంస్కరణల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనబడి నాడు-నేడు కార్యక్రమం ద్వారా ఈ ఏడాది అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రైవేట్ సంస్థలకు దీటుగా మౌలిక వసతుల పునరుద్ధరణ ప్రక్రియ ప్రారంభించామని పేర్కొన్నారు.

- Advertisement -

ఈ ఏడాది పరీక్షా కేంద్రాలుగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఏర్పాటు చేసిన బెంచ్ లు, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, త్రాగునీటి వసతి, టాయిలెట్లు మరియు ఇతర మౌలిక వసతుల కల్పన, అభివృద్ధిని చూసి ప్రైవేట్ జూనియర్ కాలేజీల నుంచి పరీక్షలకు వచ్చే విద్యార్థులు ఆశ్చర్యపోతారన్నారు. 10,52,221 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు గానూ గతేడాది ఈ పరీక్షలలో ఉత్తీర్ణులు కాని 93,875 మంది విద్యార్థులు మళ్లీ ప్రస్తుతం నిర్వహిస్తున్న పరీక్షలకు హాజరయ్యేలా గ్రామ,వార్డు సచివాలయ సిబ్బంది ప్రోత్సహించారని తెలిపారు. విద్యార్థులు పరీక్షలు రాసేందుకు ప్రోత్సహించిన సంబంధిత సిబ్బందికి పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News