Thursday, April 18, 2024
Homeనేరాలు-ఘోరాలుGarla: 16 క్వింటాళ్ల నల్ల బెల్లం స్వాధీనం

Garla: 16 క్వింటాళ్ల నల్ల బెల్లం స్వాధీనం

నల్లబెల్లం, పటిక రవాణాపై నిఘా

గార్ల మండల పరిధిలోని మర్రిగూడెం గ్రామ శివారులో గురువారం అక్రమంగా తరలిస్తున్న నల్ల బెల్లం, పటిక స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ ఐ జీనత్ కుమార్ తెలిపారు. గార్ల మండల కేంద్రంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా మరిపెడ గ్రామానికి చెందిన సుంకరి శ్రీకాంత్ గూడెల్లి రఘు ఇరువురు మర్రిగూడెం శివారులో బొలెరో వెహికల్ లో అక్రమంగా నల్ల బెల్లం, పటిక తరలిస్తున్నారన్న నమ్మదగిన సమాచారం మేరకు తనిఖీ చేపట్టి బొలెరో వ్యాపారంలో 33 బ్యాగులలో ఉన్న 16 క్వింటాల నల్ల బెల్లం 50 కేజీల పట్టికను స్వాధీనం చేసుకున్నారు. ఇరువురిని అదుపులోకి తీసుకొని వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించి ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ తెలిపారు. ఈ తనిఖీల్లో హెడ్ కానిస్టేబుల్ జయరాజ్, కానిస్టేబుళ్లు మంగీలాల్, శ్రీనివాస్ ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News