ప్రజల భవిష్యత్తుకు ప్రకటించిన మినీ మేనిఫెస్టో పథకాలన్నీ అమలు చేసి, రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమ పాలన కొనసాగించే సత్తా చంద్రబాబు నాయుడు ఒక్కడికే ఉందని టిడిపిని ఆశీర్వదించాలని టిడిపి ఎస్సీ సెల్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గిత్త జయసూర్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మిడుతూరు మండల పరిధిలోని 49 బన్నూరు గ్రామంలో టిడిపి నంద్యాల పార్లమెంటు ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి, నియోజవర్గ సమన్వయకర్త గౌరు వెంకట్ రెడ్డి ఆదేశాల మేరకు మండల కన్వీనర్ ఖాతా రమేష్ రెడ్డి, గుండం రమణారెడ్డి ఆధ్వర్యంలో ఎస్సీ సెల్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గిత్త జయసూర్య బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఇంటింటికి వెళ్లి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రజల సంక్షేమానికి భరోసాగా ప్రకటించిన మానిఫెస్టోలోని పథకాలను టిడిపి నాయకుడు గిత్త జయసూర్య ప్రజలకు చదివి వినిపిస్తూ, వైసిపి ప్రజా వ్యతిరేక పాలనను ఎండగడుతున్నారు. ప్రజలు టిడిపిని ఆశీర్వదించాలని ఆయన అభ్యర్థించారు.
ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి, సోఫీ సాహెబ్, వెంకటేశ్వర్లు, ఎల్లయ్య, రామకృష్ణుడు, శ్రీనివాసులు, సురేష్, జయన్న, రసూల్, పగిడ్యాల టిడిపి నాయకులు పగడం సోమశేఖర్. పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.