Monday, May 20, 2024
Homeహెల్త్ACV beauty & health: ACVతో అందం, ఆరోగ్యం

ACV beauty & health: ACVతో అందం, ఆరోగ్యం

ఇంట్లో ఎప్పుడూ ఏసీవీని స్టాక్ పెట్టండి, దీని షెల్ఫ్ లైఫ్ కూడా చాలా ఎక్కువే

యాపిల్ సిడార్ వెనిగర్ (ఎసివి) వినియోగంతో మనం పొందే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఇది మన అందాన్ని పరిరక్షించడమే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. యాపిల్ సిడార్ వెనిగర్ చర్మంపై ఏర్పడ్డ మచ్చలను పోగొడుతుంది. ఇందుకోసం యాపిల్ సిడార్ వెనిగర్, నీరు రెండింటినీ సమపాళ్లల్లో తీసుకుని బాగా కలపాలి. ఆ మిశ్రమంలో కాటన్ బాల్ ముంచి ముఖానికి అప్లై చేసుకోవాలి. తర్వాత కొన్ని నిమిషాలు దాన్ని అలాగే వదిలేసి ఆతర్వాత నీటితో ముఖం శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితాలు చూస్తారు.

  • ఎసివి (యాపిల్ సిడార్ వెనిగర్) నోటి దుర్వాసనను కూడా పోగొడుతుంది. బేకింగ్ సోడాను తీసుకుని మొదట దానితో దంతాలను బాగా బ్రష్ చేసుకోవాలి. తర్వాత నీటితో నోటిని బాగా కడుక్కోవాలి. అనంతరం ఎసివితో బాగా పుక్కిలించి మళ్లా నీళ్లతో నోటిని బాగా కడుక్కోవాలి. ఇలా చేస్తే నోరు దుర్వాసన రాదు.
  • ఎసివి చేసే మరో ప్రయోజనకరమైన పని ఇంకొకటి ఉంది. ముఖ్యంగా వేసవి కాలంలో చమట పోసి తొందరగా శరీరం దుర్వాసన వస్తుంటుంది. ఈ సమస్యను పోగొట్టడంలో ఎసివి బాగా పనిచేస్తుంది. ఎసివిలో కాటన్ బాల్ ముంచి చంకల్లో బాగా రుద్దాలి. ఐదు నిమిషాలు అలాగే ఉంచుకుని ఆ తర్వాత స్నానం చేయాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేయడం వల్ల మంచి ఫలితాలు చూస్తారు.
  • జుట్టులోని చుండ్రు సమస్యను కూడా ఎసివి పోగొడుతుంది. ఒక బాటిల్ తీసుకుని అందులో నీటిని, ఎసివిని తీసుకుని బాగా కలపాలి. అందులో కాటన్ బాల్ ని ముంచి చుండ్రు ప్రభావం ఉన్న ప్రదేశంలో అప్లై చేసి మూడు నుంచి ఐదు నిమిషాల వరకూ మసాజ్ చేయాలి. పదిహేను నిమిషాలు అలాగే ఉంచుకుని ఆ తర్వాత నీటితో వెంట్రుకలను శుభ్రంగా కడుక్కోవాలి. అయితే జుట్టును నీటితో కడుక్కున్న తర్వాత షాంపును అప్లై చేయకూడదు.
  • -ఎసివితో చర్మంపై ఏర్పడే సెల్యులైట్ రిడక్షన్ కూడా సాధ్యమే. మూడు పాళ్లు యాపిల్ సిడార్ వెనిగర్ ను, ఒక పాలు ఆలివ్ ఆయిల్ ని తీసుకుని ఆ రెండింటి మిశ్రమాన్ని బాగా కలపాలి. సెల్యులైట్ ఉన్న ప్రదేశంలో దాన్ని అప్లై చేసి మూడు నుంచి ఐదు నిమిషాలు మసాజ్ చేయాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేయాలి. ఈ ఆయిల్ మసాజ్ తో సెల్యులైట్ కనిపించడం తగ్గుతుంది.
  • ఎసివి వల్ల మనం పొందే మరొక ముఖ్య ప్రయోజనం ఏమిటంటే బరువు బాగా తగ్గుతాం. రెండు టీస్పూన్ల ఎసివిలో 8 ఓజడ్ పరిమాణం నీటిని కలపాలి. ఆ మిశ్రమాన్ని అన్నం తినడానికి ముందు లేదా తర్వాత తాగాలి. ఈ డ్రింకును రోజుకు మూడు సార్లు తాగడం మంచిది. దంతాలు తళతళలాడాలంటే నీటిని కలిపిన ఎసివి సొల్యూషన్ తో ఉదయమే నోటిని బాగా పుక్కిలిస్తే సరి. అలా పుక్కిలించిన తర్వాత బ్రష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల దంతాలపై ఉండే పసుపుపచ్చని మచ్చలు పోయి దంతాలు ముత్యాల్లా తెల్లగా మెరుస్తాయి.
  • మ్రుదువైన , సున్నితమైన పాదాలు కావాలనుకునేవాళ్లు ఎసివిని ఉపయోగిస్తే మంచి ఫలితాలు పొందగలరు. స్వచ్ఛమైన యాపిల్ సిడార్ వెనిగర్ లో ప్రతిరోజూ పాదాలను ఒక పదిహేను నిమిషాల నుంచి 20 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇలా చేయడం వల్ల పాదాలు ఎంతో మ్రుదువుగా తయారవుతాయి. పాదాలపై ఉండే చర్మంపై ఏర్పడ్డ పగుళ్లు కూడా పోతాయి. పాదంపై రఫ్ గా ఉన్న ప్రదేశం కూడా మ్రుదువుగా తయారవుతుంది. అంతేకాదు పాదాల్లో చేరిన ఫంగస్ ను సైతం పోగొడుతుంది.
  • ఇక నల్లని మీ జుట్టు మరింత అందాలు చిందించాలంటే యాపిల్ సిడార్ వెనిగర్, నీటిని సమపాళ్లల్లో తీసుకుని బాగా కలపాలి. జుట్టుకు షాంపు పెట్టుకున్న తర్వాత ఈ మిశ్రమంతో బాగా కడగాలి. ఆ తర్వాత కొన్ని నిమిషాల పాటు వెంట్రుకలను అలాగే వదిలేయాలి. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు మరింత నల్లగా నిగ నిగలాడతాయి.
  • -గొంతునొప్పిని కూడా ఎసివి బాగా తగ్గిస్తుంది. ఒక టేబుల్ స్పూన్ ఎసివి, ఒక టీస్పూన్ ఉప్పు రెండింటినీ ఒక గ్లాసుడు గోరువెచ్చటి నీళ్లల్లో వేసి బాగా కరగనివ్వాలి. ఆ నీళ్లతో రోజుకు మూడు నుంచి నాలుగుసార్లు నోటిని పుక్కిలించాలి. ఇలా చేయడం వల్ల గొంతునొప్పి బాగా తగ్గుతుంది. ఎసివి ఎముకలను సైతం ఎంతో ద్రుఢం చేస్తుంది. అన్నం తినడానికి ముందు లేదా తర్వాత ఎసివిని తాగాలి. ఇలా చేయడం వల్ల కాల్షియం ఆబ్సార్పషన్ సరిగా జరిగి ఎముకలు ద్రుఢంగా తయారవుతాయి. అయితే ఈ టిప్స్ పాటించే ముందు ఎసివి ఎలర్జీ మీకుందో లేదో గమనించుకోవాలి. హార్డ్ రూపంలో దాన్ని ఉపయోగించకూడదు. అందుకే సంబంధిత వైద్య నిపుణులతో ఒకసారి సంప్రదించి దీన్ని వినియోగిస్తే మరింత మంచి ఫలితాలు పొందుతారని వైద్య నిపుణులు చెపుతున్నారు.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News