Saturday, July 27, 2024
Homeఆంధ్రప్రదేశ్Jagan: ఉర్ధూ రెండో అధికారిక భాష, మైనారిటీస్‌ వెల్ఫేర్‌ డేలో సీఎం జగన్

Jagan: ఉర్ధూ రెండో అధికారిక భాష, మైనారిటీస్‌ వెల్ఫేర్‌ డేలో సీఎం జగన్

కలాం జయంతి ఉత్సవాలలో ..

నేషనల్‌ ఎడ్యుకేషన్‌ డే
ఈ రోజు భారత తొలి విద్యాశాఖమంత్రిగా దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యాసంస్ధలు స్ధాపించిన భారతరత్న మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ గారి జయంతి. భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా 1947 నుంచి 1958 వరకు ఆజాద్‌ గారి సేవలన్నింటినీ గుర్తు చేసుకుంటూ ఆయన జయంతిని నేషనల్‌ ఎడ్యుకేషన్‌ డే గా మనందరం జరుపుకుంటున్నాం. అలాంటి ఆజాద్‌ గారి జయంతిని మైనార్టీస్‌ డేగా 2008లో అప్పటి ముఖ్యమంత్రి, మన ప్రియతమ నాయకుడు, దివంగత నేత రాజశేఖరరెడ్డి గారు అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా ప్రకటించారు. దాన్ని మనందరం సంతోషంగా జరుపుకుంటూ… ముస్లింలలో పేదలందరికీ దేశంలోనే తొలిసారిగా రిజర్వేషన్లు అమలు చేసిన వ్యక్తి దివంగత మహానేత రాజశేఖరరెడ్డి గారు అని సంతోషంగా చెబుతున్నాను. నాన్నగారు ముస్లిం సోదరుల పట్ల, మైనార్టీల సంక్షేమం పట్ల ఒక అడుగు వేస్తే.. ఆయన బిడ్డగా, మీ అన్నగా, మీ వాడిగా రెండు అడుగులు వేశాను అని సగర్వంగా తెలియజేస్తున్నాను.

- Advertisement -

ముస్లింల సమగ్ర సాధికారితే లక్ష్యంగా…
ఈ రోజు ముస్లిం సోదరులకు రాజకీయ, ఆర్ధిక, మహిళా, విద్యా సాధికారత విషయంతో పాటు వారికి సంక్షేమం అందించే ఏ విషయంలోనైనా, ఏ రకంగా చూసినా రాష్ట్రంలో మనందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే.. 2019 నుంచి అనేక గొప్ప మార్పులు చోటుచేసుకున్నాయి.

మీరందరూ గతానికీ, ఇప్పటికీ తేడాను గమనించండి. మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వని మనసు రాని గత ప్రభుత్వం. గత ప్రభుత్వం హయాంలో మైనార్టీలకు మంత్రి పదవులు ఇవ్వడానికి మనసురాని ముఖ్యమంత్రి, ప్రభుత్వం అప్పట్లో ఉంటే… మన ప్రభుత్వంలో ఈ 53 నెలల కాలంలో రెండు దఫాలు మంత్రిమండలి కూర్పులో మార్పులు చేశాం. రెండు మంత్రిమండలిలో కూడా ఏకంగా డిప్యూటీ సీఎం హోదాలో ఈ రోజు నా మైనార్టీ సోదరుడు ఇక్కడే ఉన్నాడు అంటే గతానికి ఇప్పటికీ తేడా గమనించండి.

మన హయాంలో నలుగురు ఎమ్మెల్యేలు మరో నలుగురు ఎమ్మెల్సీలుగా…
ఈ రోజు మన పార్టీ నుంచి దేవుడి దయతో నలుగురు మైనార్టీలను ఎమ్మెల్యేలుగా గెలిపించుకోగలిగాం. ఈ 53 నెలల కాలంలో మరో నలుగురిని ఎమ్మెల్సీలుగా కూర్చొబెట్టగలిగాం. ఈ విషయాన్ని గర్వంగా చెబుతున్నాను. అంతేకాకుండా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా తొలిసారిగా నా సోదరి శాసనమండలి ఉపాధ్యక్షురాలిగా ఉన్నారంటే… నా అక్కచెల్లెమ్మలు, ముస్లిం సోదరుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వారి బాగోగులు చూడ్డానికి ఎంత బాగా అడుగులు వేస్తుందో చెప్పడానికి ఇది చరిత్రలో ఒక గొప్ప నిదర్శనంగా నిలబడుతుంది.

నామినేటెడ్ పనులు, పదవుల్లోనూ….
ప్రతి అడుగులోనూ రాష్ట్రంలో ఏ పదవి ఇచ్చినా ఎంపీపీలు, జడ్పీ ౖచైర్మన్, మున్సిపల్, కార్పోరేషన్‌ చైర్మన్‌ పదవులు తీసుకున్నా, ఏఏంసీ పదవులు తీసుకున్నా… నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఏకంగా 50 శాతం పదవులు ఇవ్వాలని చట్టం చేశాం. అందులో కూడా 50 శాతం నా అక్కాచెల్లెమ్మలకే ఇవ్వాలని కూడా చట్టం చేసింది కూడా మీ బిడ్డ ప్రభుత్వ హయాంలోనే అని చెప్పడానికి సంతోషపడుతున్నాను. ఈ రోజు మెజార్టీ ప్రజలు కానీ, మైనార్టీలు కానీ పేదలందరికీ ఇలా ఏది చేసినా నిండు మనస్సుతో తపన, తాపత్రయంతో వారి బ్రతుకుల్లో మార్పులు తీసుకురావాలని అడుగులు వేశాం.

భిన్నత్వంలో ఏకత్వం మన బలం…
భారతదేశం అంటేనే ఏడురంగుల ఇంద్రధనస్సు. ఇవాళ భారతదేశంలో అనేక రాష్ట్రాలు, భాషలు, సంస్కృతులు, సాంప్రదాయాలు, అనేక కులాలు, అభిప్రాయాలు కూడా ఉన్నాయి. అన్నీ ఉన్నా కూడా అందరం కలిసికట్టుగా.. ఇంధ్రధనస్సుగా ఒక్కటిగా ఉంటున్నాం. ఎప్పుడూ ఉంటాం అన్నది భారతదేశ చరిత్ర. భిన్నత్వంలో ఏకత్వం మన బలం. ఒకరినొకరు గౌరవించుకోవడం మనం బలం. అల్పసంఖ్యలో ఉన్నవారికి అండగా నిలబడటం మన బలం. మెజారిటీ, మైనార్టీల మధ్య అన్నదమ్ముల ఆత్మీయత, అనుబంధం పెంచటం ఒక వైఎస్సార్‌ బలం, ఒక జగన్‌ బలం.. మన అందరి బలం.

ఈ ప్రభుత్వం మనందరిది…
ఈ ప్రభుత్వం మన అందరిదీ. ఈ ప్రభుత్వంలో ఒక జగన్‌ కనిపిస్తాడు. జగన్‌ ఇటు వైపునా అటు వైపునా డిప్యూటీ సీఎంలుగా ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక బీసీ, ఒక మైనార్టీలు కనిపిస్తారు. వీళ్లందరూ నా పక్కనే కనిపిస్తారు. మీ బిడ్డ ప్రమాణం చేసిన మొట్టమొదటి రోజు నుంచి కూడా వీళ్లందరూ పక్కనే కనిపిస్తారు. ఈ ప్రభుత్వం ఒక్క జగన్‌దే కాదు… మనందరి.
ఈ 53 నెలల కాలంలో వివిధ పథకాల కింద దేశంలో ఎప్పుడూ జరగని విధంగా, మన రాష్ట్రంలో ముందెప్పుడూ చూడని విధంగా, ప్రతి అడుగులోనూ, పరిపాలన చేసే విషయంలోనూ, ప్రతి మాటకు ముందు నా ఎస్సీ, ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ, నా అగ్రవర్ణ నిరుపేదలు అని చెప్పి… గతంలో ఓనర్‌షిప్‌ తీసుకున్న పరిస్థితులు లేవు. కానీ మీ బిడ్డ ప్రభుత్వంలో ప్రతి ఒక్క సందర్భంలోనూ నా అంటూ.. ఇది అంతా నా కుటుంబం అని చెప్పి భరోసా ఇస్తూ అడుగులో అడుగులు వేసిన పరిస్థితి ఉంది.

గతంలో ఎవరైనా ఇలా చేశారా…?
గతానికి ఇప్పటికీ తేడా గమనించండి. గతంలో ఐదేళ్ల క్రితం ఎవరైనా… ఇలా బటన్‌ నొక్కగలుగుతారు… ఏకంగా రూ.2.40 లక్షల కోట్లు నాలుగు సంవత్సరాలలో ప్రతి పేద అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లో వెళ్లే పరిస్థితి వస్తుందని.. మైక్‌ పట్టుకుని మాట్లాడి ఉంటే… మీరు నమ్మి ఉండేవారా ? మీ మనస్సాక్షిని అడగండి.? కారణం ఆ రోజు అదే ప్రభుత్వం. ఈరోజు అదే ప్రభుత్వం. ఆ రోజు అదే బడ్జెట్, ఈ రోజు కూడా అదే బడ్జెట్‌. అప్పులు కూడా అప్పటి కన్నా గ్రోత్‌ రేట్‌ ఇప్పుడే తక్కువ. మరి మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి మాత్రమే.

53 నెలల కాలంలో రూ.2.40 లక్షల కోట్లు జమ…
ఈ నాలుగు సంవత్సరాల కాలంలో మీ బిడ్డ బటన్‌ నొక్కి… నేరుగా రూ.2.40 లక్షల కోట్లు అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి పోతున్నాయి. ఆలోచన చేయండి గతంలో ఇది ఎందుకు జరగలేదు ? ఇలా బటన్‌ నొక్కే పరిస్థితి ఎందుకు లేదు ? ఈ రూ.2.40 లక్షల కోట్లు ఎవరి జేబుల్లోకి పోయిందన్నది ఆలోచన చేయండి.

లంచాలు, వివక్షలేని పాలన, పేదవాడిని గుండెల్లో పెట్టుకుని చూసే పాలన, అక్కచెల్లెమ్మలు బాగుండాలని, వాళ్లు బాగా చదవాలని, ఎదగాలని ఆలోచన చేసే పాలన వస్తుందని.. అలా చేయగలుగుతామని ఐదేళ్ల క్రితం ఎవరైనా చెప్పి ఉంటే నమ్మి ఉండేవాళ్లమా? ఆలోచన చేయండి. అప్పటికీ ఇప్పటికీ ప్రస్ఫుటమైన తేడా చూపిస్తూ అడుగులు ముందు వేస్తున్నాం.
నేరుగా రూ.2.40 లక్షలు కోట్లు నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి వేయడమే కాకుండా… ఆ పేదవాళ్లు వెళ్తున్న స్కూళ్లు, ఆసుపత్రులు కూడా మార్పు చేస్తున్నాం. పేదవాడికి తోడుగా ఉండే ప్రతి అడుగు మార్పు చెంది, పేదవాడిని గుండెల్లో పెట్టుకుని వాళ్ల ఇంటికే వచ్చి చిక్కటి చిరునవ్వుతో గుడ్‌ మార్నింగ్‌ చెప్పి… ఆ అవ్వాతాతలకు పెన్షన్‌ ఇచ్చే గొప్ప పాలన జరుగుతున్న రోజులు. తేడా గమనించండి.

మైనార్టీలకు 53 నెలల్లో రూ.23,176 కోట్లు.
ఈ రోజు నా ముస్లిం మైనార్టీలనే తీసుకుంటే.. ఈ 53 నెలల కాలంలో నా అన్నదమ్ములు, నా అక్కచెల్లెమ్మలకు నేరుగా బటన్‌ నొక్కి వారి ఖాతాల్లోకి రూ.12,375 కోట్లు పంపించగలిగాం.
మరోవై నాన్‌ డీబీటీ పథకాల అంటే ఇళ్ల స్ధలాలు, విద్యాకానుక, సంపూర్ణ పోషణం వంటివి లెక్కవేస్తే.. మరో రూ.10,800 కోట్లు. అంటే నాలుగేళ్ల కాలంలో రూ.23,176 కోట్లు ఇవ్వగలిగాం. అంటే మార్పు ఎంతగా ఉందో చూడండి. ఇందులో వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక, అమ్మఒడిపథకం, రైతు భరోసా, వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ చేయూత, విద్యాదీవెన, వసతి దీవెన, సున్నావడ్డీ ఇలా ఏ పథకం తీసుకున్నా నా అక్కచెల్లెమ్మల ముఖాల్లో సంతోషం చూసే విధంగా అడుగులు వేయగలిగాం. ఇలా రూ.23 వేల కోట్ల పైచిలుకు మీ బిడ్డ మైనార్టీల సంక్షేమం కోసం ఖర్చుపెడితే.. ఐదేళ్ల గత పాలనలో కేవలం రూ.2,665 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. తేడా మీరే గమనించండి.

ఈ రోజు ప్రతి అడుగులోను, ప్రతి పనిలోనూ, వేసే ప్రతి మొలక చెట్టు కావాలని, ప్రతి ముస్లిం కుటుంబం కూడా బాగుపడాలని, వారి పిల్లలు గొప్పగా ఎదగాలని తపనతో అడుగులు పడ్డాయి.

నాయకుడు ఆలోచన ఎన్నికల కోసం కాదు– భవిష్యత్‌ కోసం..
ఈ మధ్య కాలంలో షాదీ తోపా అనే పథకాన్ని తీసుకొచ్చాం. నా అక్కచెల్లెమ్మల పిల్లలు బాగా చదవాలని, వారిని చదివించే విధంగా ప్రోత్సహించేందుకు ఆ షాదీతోఫా కోసం పదోతరగతి పాస్‌ కావాలన్న నిబంధన పెట్టాం. ఆ నిబంధన పెట్టినప్పుడు ఎన్నికలకు వెళ్తున్నాం… మనం ఇలాంటి కండిషన్లు ఎందుకు పెట్టడం, పదోతరగతి పాస్‌ అవ్వాలన్న నిబంధనను తీసేద్దాం అని అన్నారు.
అప్పుడు నేను చెప్పాను. ఎన్నికలు అన్నది వేరే విషయం. నాయకుడు అన్నవాడు ఆలోచన చేయాల్సింది ఎన్నికలు గురించి కాదు.. రేప్పొద్దున వీళ్ల జీవితాలలో వెలుగు ఎలా నింపాలి అన్న ఆలోచనలు జరగాలని చెప్పాను. ఈ రోజు మనం పదోతరగతి సర్టిఫికేట్‌ తప్పనిసరి అని చెప్పడంతో పాటు రూ.1లక్ష పెళ్లి చేసుకునేటప్పుడు ఇస్తామని చెబుతున్నాం. అప్పుడు దానికోసం కచ్చితంగా పదోతరగతి వరకు చదివించే దిశగా తల్లిదండ్రులు అడుగులు వేస్తారు. ఆ పిల్లలు కూడా చదవడం మొదలుపెడతారు.

చదువులకూ అండగా…
ఆ పిల్లలు చదువుల కోసం అమ్మఒడి పథకం ద్వారా అడుగులు ముందుకు వేయించగలుగుతాం. నాడు నేడు ద్వారా స్కూళ్లను మార్పు చేస్తున్నాం. ఇంగ్లిషు మీడియం, 6వ తరగతి నుంచి ప్రతి తరగతిలోనూ ఐఎఫ్‌పి డిజిటల్‌ స్క్రీన్లు ఏర్పాటు చేసి స్కూళ్లను మార్పు చేస్తున్నాం. బైలింగువల్‌ టెక్ట్స్‌బుక్స్‌ తీసుకువచ్చాం. 8వతరగతి పిల్లలకు ట్యాబులు ఇస్తున్నాం. ఇవన్నీ రాబోయే రోజుల్లో మన పిల్లల భవిష్యత్‌ మారే పరిస్థితులకు ఊతమిస్తాయి. ఆ కార్యక్రమంలో అమ్మఒడితో సహా ఇవన్నీ చేయడంతో పాటు ఉన్నత విద్యకు వచ్చేసరికి పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌ ఇస్తూ.. విద్యాదీవెన, వసతి దీవెన కూడా కల్పిస్తున్నాం. ఏ పేద తల్లి కూడా తన పిల్లలను చదవించేందుకు అప్పులపాలయ్యే పరిస్థితి రాకుండా ప్రతి అడుగులోనూ చేయిపట్టుకుని నడిపించే గొప్ప కార్యక్రమం చేస్తున్నాం. అందులో మరో అడుగు కళ్యాణమస్తు, షాదీతోఫా పథకాలని గొప్పగా చెప్పాను.

ఈ 53 నెలల పాలనలో దేవుడి దయతో మంచి చేయగలిగానని గుండెల మీద చేతులు వేసుకుని ధైర్యంగా చెప్పగలను. ఈ సంతోషాన్ని మీ అందరితో పంచుకునే గొప్ప భాగ్యం కూడా ప్రాప్తమయింది.

ఉర్ధూ రెండో అధికారిక భాష
మరో విషయం చెప్పాలి… మనందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉర్ధూని రెండో అధికారిక భాషగా ప్రకటించినంది మన హయాంలోనే. ఆలాగే రాష్ట్రంలోని అన్ని వర్గాల మైనార్టీల కోసం సబ్‌ప్లాన్‌ అమలు చేస్తున్నది కూడా మన ప్రభుత్వమే. దీనికోసం ఏకంగా ఆంధ్రప్రదేశ్‌ మైనార్టీస్‌ కాంపోనెంట్‌ చట్టం– సబ్‌ప్లాన్‌ను తీసుకుని వచ్చాం.
ప్రతి అడుగులోనూ మంచి చేస్తూ ముందుకు అడుగులు వేశాం. మీకు ఏ కష్టం వచ్చినా దాన్ని నా కష్టంగా భావించి… అడుగులు ముందుకు వేసింది మన ప్రభుత్వం.

విజయవాడ నుంచే హజ్‌యాత్ర…
అలాగే గతంలో హజ్‌ యాత్రకు వెళ్లాలంటే హైదరాబాద్‌ నుంచి వెళ్లే పరిస్థితి. విజయవాడ నుంచి నేరుగా వెళ్లే పరిస్థితి రావాలి, ఇది కొత్త రాష్ట్రం, ఇక్కడే విజయవాడ నుంచి తీసుకునిపోవాలి, ప్రతి ముస్లిం సోదరుడికి అండగా నిలబడాలని అడుగులు వేశాం. విజయవాడను ఎంబార్కేషన్‌ పాయింట్‌ కింద ప్రకటించాం. ఆ తర్వాత హజ్‌ యాత్రకు హైదరాబాద్‌ కంటే విజయవాడ నుంచి విమానటిక్కెట్‌… రూ.80వేలు ఎక్కువగా వేశారని నా దగ్గరకు డిప్యూటీ సీఎం అంజాద్‌ వచ్చి చెప్పాడు. మనం ఇవ్వాలంటే అవుతుందా అని అడిగాడు. అప్పుడు నేను చెప్పాను. ఇక్కడ ఉన్నది మన ప్రభుత్వం కచ్చితంగా తోడుగా ఉంటామని చెప్పాను. రూ.14 కోట్లు ఎక్కువ అవుతుందంటే వెంటనే చెక్‌ ఇచ్చి… కార్యక్రమాన్ని ముందుకు పోయేలా చేశాం. నేను అడిగిందల్లా ఒక్కటే… హజ్‌యాత్రకు వెళ్లినప్పుడు మీ బిడ్డ ప్రభుత్వం కోసం దువా చేయండి అని గట్టిగా కోరాను.
ఈ రోజు మైనార్టీలందరినీ కూడా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్న ప్రభుత్వం మనది. మొట్టమొదటిసారిగా ఎప్పుడూ జరగని విధంగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇమామ్‌లకు రూ.10వేలు, మౌజమ్‌లకు రూ.5వేలు గౌరవ వేతనం పెంచాం. అలాగనే మొట్టమొదటిసారిగా గతంలో ఎన్నడూ లేని విధంగా పాస్టర్‌లకు కూడా రూ.5వేలు గౌరవ వేతనం ఇస్తున్న ప్రభుత్వం కూడా మనదే.
వక్ఫ్‌ బోర్డు, ముస్లిం మైనార్టీ, చర్చిలకు సంబంధించిన ఆస్తుల సంరక్షణ కోసం ఏకంగా జీవో నెంబరు 60 జారీ చేశాం. వీటి రక్షణ కోసం ఒక జీవో ఇష్యూ చేసి, జిల్లా, రాష్ట్ర స్ధాయి కమిటీలు వేసిన తర్వాత…. సచివాలయంలో ఉన్న ప్లానింగ్‌ సెక్రటరీలకు ఇన్‌ఛార్జ్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ బాధ్యతలు అప్పగిస్తూ అడుగులు వేసిన ప్రభుత్వం మనది.

ఈ రోజు ప్రతి అడుగులోనూ అందరికీ మేలు చేస్తూ… అందరి సంక్షేమం కోరే ప్రభుత్వంగా ఇవన్నీ చేస్తున్నామని మరొక్కసారి తెలియజేస్తూ.. దేవుడు దయ, మీ అందరి చల్లని దీవెనలు మీ బిడ్డ ప్రభుత్వానికి ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అని సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ తన ప్రసంగం ముగించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News