YS Jagan| కూటమి ప్రభుత్వంపై పోరాటానికి వైసీపీ సిద్ధమైంది. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులతో వైసీపీ అధినేత జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నేతలకు ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవ్వాలని దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా మూడు సమస్యలపై పోరాటం చేస్తున్నామని పేర్కొన్నారు. రైతులకు పెట్టుబడి సాయం, మద్దతు ధర, విద్యుత్ ఛార్జీలు పెంపు, ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేయాలని కోరుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు.
డిసెంబర్ 11న రైతుల సమస్యలపై, డిసెంబర్ 27న కరెంట్ ఛార్జీలపై ఎస్ఈ కార్యాలయాలు, సీఎండీ కార్యాలయాల ముట్టడి చేస్తామని జగన్ తెలిపారు. అనంతరం ప్రజలతో కలిసి అధికారులకు వినతి పత్రాలు అందజేస్తామని తెలిపారు. అలాగే జనవరి 3న ఫీజు రియంబర్స్ మెంట్ అంశంపై పోరుబాట చేపట్టనున్నట్టు ఆయన వెల్లడించారు. విద్యార్థులతో కలిసి కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లి వినతి పత్రం అందిస్తామని జగన్ వెల్లడించారు.