Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Jagan Review: వర్షాభావ పరిస్థితులపై జగన్ సమీక్ష

Jagan Review: వర్షాభావ పరిస్థితులపై జగన్ సమీక్ష

25 శాతం తక్కువగా వర్షాలు

వర్షాల కొరత నేపథ్యంలో రాష్ట్రంలో వ్యవసాయ రంగం పరిస్థితులు, కంటిన్జెన్సీ ప్రణాళికపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులను సీఎంకు వివరించిన వాతావరణ శాఖ అధికారులు. జూన్‌ నుంచి ఆగస్టు వరకూ రాష్ట్రంలో కురవాల్సిన సాధారణ వర్షపాతం 419.6 మి.మీ. కాగా 314.6 మి.మీ. వర్షం కురిసిందని తెలిపిన అధికారులు. 25 శాతం తక్కువగా వర్షాలు కురిసినట్టు తెలిపిన అధికారులు. కోనసీమ, కాకినాడ, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, ఎస్పీఎస్‌ నెల్లూరు, తిరుపతి, పల్నాడు, ప్రకాశం, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్సార్, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో వర్షాల కొరత ఉన్నట్టు తెలిపిన అధికారులు. ఇందులో కొన్ని ప్రాంతాలకు ఇరిగేషన్‌ సదుపాయం ఉన్నందున అక్కడ వర్షాల కొరత ప్రభావం తక్కువగానే ఉందన్న అధికారులు. రాష్ట్రంలో మేజర్, మీడియం, మైనర్‌ ప్రాజెక్టుల్లో నీటి నిల్వల వివరాలను సీఎంకు వివరించిన అధికారులు. అన్ని రిజర్వాయర్లలో నీటి సామర్ధ్యం 1174.58 టీఎంసీలు కాగా, 507.88 టీఎంసీల నీరు ఉందని తెలిపిన అధికారులు. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లోనూ తెలంగాణ రాష్ట్రం విద్యుత్‌ ఉత్పత్తి కోసం దిగువకు విడిచిపెడుతోందని తెలిపిన అధికారులు. ముందస్తుగా సాగునీటిని విడుదలచేయడం వల్ల కృష్ణాడెల్టాకు అవసరమైన నీటిని అందించగలిగామన్న అధికారులు. గోదావరి డెల్టాకు ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగునీరు అందుతోందన్న అధికారులు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News