Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Jupadubangla: అంగన్వాడీలకు గ్రాడ్యుటి అమలు చేయాలి

Jupadubangla: అంగన్వాడీలకు గ్రాడ్యుటి అమలు చేయాలి

3వ రోజుకు చేరిన అంగన్వాడీల నిరసన

రాష్ట్రంలో అంగన్వాడి అందరికీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటి అమలు చేయాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. తహసిల్దార్ కార్యాలయం ఆవరణంలో మూడవరోజు మోకాలపై కూర్చొని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ ఇచ్చిన హామీలను అమలు చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని తెలిపారు. అంగన్వాడి కార్యకర్తల చేత ప్రభుత్వం వెట్టి చాకిరి చేయిస్తున్నదని ప్రభుత్వ ఉద్యోగులకు 62 సంవత్సరాల కు రిటైర్ మెంట్ ప్రకటించి, అంగన్వాడీలను మాత్రం 60 సంవత్సరాలకే ఇంటికి పంపుతున్నారని, కనీసం ఐదు లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రకటించాలని, పింఛన్ సౌకర్యం ఇవ్వాలని, రాజకీయ వేధింపులు ఆపాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటి ఇవ్వాలని అన్నారు. సర్వీసులో ఉండి చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, అంగన్వాడీలకు బీమా సౌకర్యం కల్పించాలని, సమావేశాలకు హాజరయ్యేందుకు ప్రయాణ ఖర్చులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో వెంకట రవణమ్మ, పద్మావతి, ప్రసన్న, మండల కేంద్రంలోని అన్ని అంగన్వాడి కేంద్రాల నుండి టీచర్లు ఆయాలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News