Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్Katasani: అభివృద్ధిపై చర్చకు లోకేష్ రెడీనా?

Katasani: అభివృద్ధిపై చర్చకు లోకేష్ రెడీనా?

రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై చర్చించేందుకు నారా లోకేష్ రెడీనా అంటూ సవాలు చేశారు వైసీపీ ఎంపీ కాటసాని రామిరెడ్డి. బనగానపల్లెలో యువగళం పాదయాత్రలో భాగంగా లోకేష్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన కాటసాని ఈమేరకు సవాలు విసిరారు. లోకేష్ తో పాటు యువగళం పాదయాత్రలో పాల్గొన్న స్థానిక టీడీపీ నేత బీసీ జనార్ధన్ రెడ్డిపై కూడా కాటసాని మండిపడ్డారు. 420 బీసీ జనార్దన్ రెడ్డి రాసిచ్చిన స్క్రిప్టును 840 లోకేష్ మాట్లాడడం కనీస నియోజకవర్గం మీద అవగాహన లేకుండా మాట్లాడడం ఆయన విధేయతకే వదిలి వేస్తున్నానని చెప్పారు. గత తెలుగుదేశం పార్టీ హయాంలో టిడిపి పార్టీ నాయకుల చేసిన పనులకే కమిషన్లు తీసుకున్నటువంటి అప్పటి ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డికి దక్కిందని చెప్పారు. వారి కార్యకర్తల వద్ద కమిషన్లు తీసుకునేటువంటి నాయకుడు బీసీ జనార్దన్ రెడ్డి నీ పక్కన పెట్టుకుని తనకు కమిషన్ల రామిరెడ్డి అని పేరు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు కాటసాని.
బనగానపల్లె పట్టణంలో తెలుగుదేశం పార్టీ హయాంలో రింగురోడ్డు శాంక్షన్ అయిందని కానీ వైసీపీ హయాంలో పనులు మొదలై, నిధులు విడుదల అవుతున్నాయని కాటసాని వెల్లడించారు. అనుచిత వ్యాఖ్యలు చేయడం లోకేష్ కు సరికాదని చంద్రబాబు నాయుడు తన కుమారుడైన లోకేష్ కు హితపు చెప్పుకోవాలని లేదంటే తన పాదయాత్ర ముగిసే సమయానికి ఎక్కడో ఒకచోట లోకేష్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గుర్తు చేశారు. మంగళగిరిలో లోకేష్ ను, బనగానపల్లె నియోజకవర్గంలో బీసీ జనార్దన్ రెడ్డిని ప్రజలు ఎప్పుడో పీకేశారని కాటసాని రామిరెడ్డి తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News