Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Kodumuru: రైతులకు అండగా ఉండాలనే ఉచిత పంటల బీమా పథకం

Kodumuru: రైతులకు అండగా ఉండాలనే ఉచిత పంటల బీమా పథకం

కర్నూలు జిల్లాలోని 2,42,426 మంది రైతులకు రూ.192.51 కోట్లు

రైతులకు అండగా ఉండాలనే లక్ష్యంతోనే వైఎస్ జగన్ ఉచిత పంటల భీమాను ప్రవేశ పెట్టారని కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ అన్నారు. కర్నూలు ఎంపీ సంజీవ కుమార్ తో కలిసి పంటల భీమా విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. 2022 ఖరీఫ్ పంట నష్టపోయిన రాష్ట్రంలోని 10.20 లక్షల మంది రైతన్నలకు ఈ ఖరీఫ్ ప్రారంభంలోనే రూ.1,117.21 కోట్ల బీమా పరిహారాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో బటన్ నొక్కి బీమా మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేశారు. కర్నూలు జిల్లాలోని 2,42,426 మంది రైతులకు రూ.192.51 కోట్లు నేరుగా రైతుల ఖాతాలలో జమ చేశారు. కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కార్యక్రమంలో కర్నూలు జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ బెల్లం మహేశ్వర రెడ్డి, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News