Sunday, June 30, 2024
Homeఆంధ్రప్రదేశ్Kotappakonda: ఆర్టీసీ బస్సులోనే కలెక్టర్, జెసీలు కొండకు

Kotappakonda: ఆర్టీసీ బస్సులోనే కలెక్టర్, జెసీలు కొండకు

పల్నాడు జిల్లా కలెక్టర్ ఎల్ శివ శంకర్, జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లు తమ కుటుంబం సభ్యులతో కలిసి సాధారణ భక్తులు లాగానే కోటప్పకొండకు చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని పూజలు జరిపారు. కలెక్టర్, జేసీ దంపతులకు, దేవాదాయ శాఖ అధికారులు స్వామివారి శేష వస్త్రాలతో సత్కరించి ప్రసాదాలు అందజేశారు. కొండ ప్రాంతంలో క్యూ లైన్ లో ఉన్న భక్తులను ఏర్పాట్ల గురించి అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని అన్ని ఏర్పాట్లు చూడాలని అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల అధికారులు ఏర్పాటు చేసిన ప్రభుత్వ స్టాల్సును సందర్శించారు. కలెక్టర్,జేసిల వెంట జిల్లా రెవెన్యూ అధికారి వినాయకం, తాసిల్దారులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News