Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్Kotla: ఇసుక దోపిడీని అరికట్టే దాకా పోరాటం

Kotla: ఇసుక దోపిడీని అరికట్టే దాకా పోరాటం

ఇసుక రేవుల వద్ద టీడీపీ సత్యాగ్రహం

రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఇసుక దోపిడిని అరికట్టే దాకా పోరాటం చేస్తామని మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్య ప్రకాషరెడ్డి స్పష్టం చేశారు. పార్టీ ఆదేశాల మేరకు సి. బెళగల్ మండలంలోని సింగవరం, ఈర్లదిన్నె, తిమ్మం దొడ్డి గ్రామాల సమీపంలోని ఇసుక రేవులను సందర్శించి టీడీపీ నేతలు సత్యాగ్రహం చేశారు. ఈ సందర్భంగా కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇసుక దోపిడీ కారణంగా సామాన్య ప్రజల జీవితాలతో వైసిపి ప్రభుత్వం ఆటలాడుకుంటుందని ఎద్దేవా చేశారు. గత పాలనలో ఉచితంగా ఇసుకను పంపిణీ చేయగా వైసీపి ప్రభుత్వం అధికారం చేపట్టాక భారీగా ధరలు పెంచి సామాన్యులకు భయాందోళనకు గురి చేస్తుందని అన్నారు. టిడిపి ప్రభుత్వం అధికారం చేపట్టాక ఇసుకను సాధారణ ధరలకే విక్రయాలు చేసేందుకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. ఇప్పటికైనా వైసీపి ప్రభుత్వం పెంచిన ఇసుక ధరలను వెంటనే తగ్గించి సామాన్య ప్రజలకు ఉపయోగపడాలని వారు సూచించారు. సత్యాగ్రహం అనంతరం బెలగల్ పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయంలో టిడిపి నేతలు తహసిల్దార్ కు వినతి పత్రం అందించి ఇసుక ఉచితంగా అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోడుమూరు నియోజకవర్గ టిడిపి ఇంచార్జి ఆకేపోగు ప్రభాకర్, గూడూరు పట్టణ టిడిపి అధ్యక్షులు గజేంద్ర గోపాల్ నాయుడు, మండల అధ్యక్షుడు ఎల్ సుధాకర్ రెడ్డి, బెలగల్ టిడిపి అధ్యక్షుడు గోవింద్ గౌడ్, కోడూమూరు మండల అధ్యక్షులు కోట్ల కవితమ్మ, కోడుమూరు మాజీ సర్పంచ్ సిబి లత, సీనియర్ టిడిపి నాయకులు డి సుందరాజు, నేతలు సులేమాన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News